
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీకి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థికి అనుకూలంగా ఉండి, పోటీలో ఉన్న ప్రత్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగల రాజకీయ కథాంశంతో ఉన్న సినిమాలు, జీవిత చరిత్రలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసా రం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో రజత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ అంశాలతో కూడుకున్నవి అయినప్పటికీ ఒక అభ్యర్థికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పోటీలో సానుకూలంగా, తోడ్పాటుగా ఉన్న ఏ పోస్టర్, మరే ఇతర ప్రచార సామాగ్రినికానీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రదర్శించకూడదని కూడా చెప్పారు.