biographical film
-
మోడ్రన్ మాస్టర్
ప్రముఖ దర్శకుడు రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఎక్స్’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘ఒక వ్యక్తి... ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు. అంతులేని ఆశయం.ఈ దిగ్గజ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? అనే అంశాలతో ఈ ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపొందింది’’ అంటూ రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని ఉద్దేశించి నెట్‌ఫ్లిక్స్ ‘ఎక్స్’లో పేర్కొంది. రాజమౌళి జీవిత విశేషాలు, ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాల మేకింగ్ గురించిన ఆసక్తికర సన్నివేశాలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయని తెలుస్తోంది.అంతేకాదు... ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా వంటి స్టార్స్ రాజమౌళి గురించి ఏం అబిప్రాయపడుతున్నారు? అనే సంగతులు కూడా ఈ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’లో ఉంటాయట. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ నిర్మించగా రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించారని, తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారని తెలుస్తోంది. -
‘రాజకీయ’ సినిమాలు ప్రసారం చేయొద్దు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీకి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థికి అనుకూలంగా ఉండి, పోటీలో ఉన్న ప్రత్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగల రాజకీయ కథాంశంతో ఉన్న సినిమాలు, జీవిత చరిత్రలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసా రం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో రజత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ అంశాలతో కూడుకున్నవి అయినప్పటికీ ఒక అభ్యర్థికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పోటీలో సానుకూలంగా, తోడ్పాటుగా ఉన్న ఏ పోస్టర్, మరే ఇతర ప్రచార సామాగ్రినికానీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రదర్శించకూడదని కూడా చెప్పారు. -
సచిన్ సినిమా పాట వచ్చేసింది
-
సచిన్ సినిమా పాట వచ్చేసింది
ముంబై: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 44వ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలిపాటను విడుదల చేశారు. 'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు. సచిన్ జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వంలో నిర్మాత రవి భగ్చంద్కా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను వచ్చే నెల 26న విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. విడుదలైన 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో సచిన్ బాల్యం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్య ఘట్టాల గురించిన సన్నివేశాలుంటాయి. 1983లో కపిల్ దేవ్ ప్రపంచ కప్ అందుకునే దృశ్యాలను పదేళ్ల సచిన్ టీవీలో చూసే సన్నివేశం నుంచి ఓ రోజు అతనే ప్రపంచ కప్‌ను అందుకునే వరకు ముఖ్య ఘట్టాలను ఈ సినిమాగా చిత్రీకరించారు. ఇంతకుముందు ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోనీ నేరుగా నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా కనిపించడంతో ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.