ప్రముఖ దర్శకుడు రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ఎక్స్’ వేదికగా నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘‘ఒక వ్యక్తి... ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు. అంతులేని ఆశయం.
ఈ దిగ్గజ దర్శకుడు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? అనే అంశాలతో ఈ ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపొందింది’’ అంటూ రాజమౌళి బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని ఉద్దేశించి నెట్‌ఫ్లిక్స్ ‘ఎక్స్’లో పేర్కొంది. రాజమౌళి జీవిత విశేషాలు, ‘బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల మేకింగ్ గురించిన ఆసక్తికర సన్నివేశాలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయని తెలుస్తోంది.
అంతేకాదు... ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రానా వంటి స్టార్స్ రాజమౌళి గురించి ఏం అబిప్రాయపడుతున్నారు? అనే సంగతులు కూడా ఈ ‘మోడ్రన్ మాస్టర్స్: రాజమౌళి’లో ఉంటాయట. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్ నిర్మించగా రాఘవ్ ఖన్నా దర్శకత్వం వహించారని, తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment