ఎలక్ట్రానిక్ మీడియాతోనే సమస్య: మంత్రి
Published Mon, Apr 24 2017 2:34 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
విజయవాడ: ఎలక్ట్రానిక్ మీడియాపై మంత్రి పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఛానెల్స్ రేటింగ్ కోసమే మంత్రి లోకేష్ వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నాయి.. మాట్లాడే సమయంలో తప్పులు దొర్లడం సహజమని సమర్ధించారు. ప్రింట్ మీడియా తో ఎటువంటి ఇబ్బంది లేదంటూనే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా తోనే సమస్య అంతా ఎదురవుతోందని చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
Advertisement
Advertisement