అన్నానగర్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిఏటా సీబీఎస్‌ఈ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అందించే జాతీయ అవార్డు ఈ సారి నగరానికి చెందిన పీఎస్ సీనియర్(మైలాపూర్) సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీశ్రీనివాసన్‌ను వరించింది. ఈ మేరకు ఆమె గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు.
మానవ వనరుల విభాగం మంత్రి స్మృతి ఇరానీ తనను స్వయంగా రిసీవ్ చేసుకున్నారని ఆమె ఫోన్‌ద్వారా నగరంలోని విలేకరులకు తెలిపారు. శుక్రవారం ఉదయం అవార్డుకు ఎంపికైన సీబీఎస్‌ఈ అధ్యాపకులను ప్రధానమంత్రి మోడీ తనతో అల్పాహార విందుకు ఆహ్వానించారని తెలిపారు. అధ్యాపకురాలినైనందుకు తాను గర్వపడుతున్నానన్నారు. శుక్రవారం స్మృతిఇరానీ చేతుల మీదగా తాను ఈ అవార్డును అందుకున్నట్టు తెలిపారు. తనతో పాటు మరో 50 మంది టీచర్లు అవార్డు అందుకున్నట్టు ఆమె వెల్లడించారు.
ప్రధానితో బ్రేక్‌ఫాస్ట్ చేశా!
Published Sat, Sep 6 2014 1:48 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement
Advertisement