రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందనలు తెలుపుతుండగా అభివాదం చేస్తున్న అవార్డు గ్రహీత మధుబాబు
కాశీబుగ్గ: కాశీబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆసపాన మధుబాబు రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఢిల్లీలో జరగాల్సిన అవార్డు ప్రధానోత్సవం కరోనా కారణంగా ఆన్‌లైన్‌కు పరిమితమైంది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అ వార్డులు పొందిన మధుబాబు తొలిసారిగా జాతీయ అవార్డును ఆన్‌లైన్‌లో అందుకున్నారు. విద్యార్థులకు ఆంగ్ల భాష బోధన, వీసీఆర్ ప్రజెంటేషన్, మన టీవీ లైవ్ ప్రజెంటేషన్, స్టడీ అవర్స్ నిర్వహణ, నైట్ విజిటింగ్, ఆదివారం ప్రత్యేక తరగతుల నిర్వహణ వంటి అంశాలతో ఆయన ఆకట్టుకున్నారు. సమయం దొరికితే వృధా చేయకుండా విద్యార్థులే సర్వస్వంగా భావించి నిరంతర ఉపాధ్యాయుడిగా, నిత్య విద్యారి్థగా మసలుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీడియో కాల్ ద్వారా మధుబాబుకు అభినందనలు తెలిపారు. మధు బాబు మాట్లాడుతూ స్వయంగా వెళ్లలేని పరిస్థితి అయినప్పటికీ వీడియో కాన్ఫరెన్సులో కలిసి మాట్లాడుకోవడం ఆనందాన్ని ఇచ్చిందనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment