
కావలసినవి: ఓట్స్ – ఆరు టేబుల్‌స్పూన్లు; నీళ్లు – ఒక కప్పు; సోయా పాలు – అర కప్పు; డ్రై ఫ్రూట్స్ – కావలసినన్ని; ఎండిన కర్బూజ గింజలు – ఒక టేబుల్ స్పూన్; పండు ఖర్జూరాలు – 10 (గింజ తీసి సన్నగా తరగాలి)
తయారి: నీళ్లను మరిగించాలి. అందులో ఓట్స్ వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. దీంట్లో ఎండు కర్బూజ గింజలను వేసి స్టౌ ఆఫ్ చేయాలి. తర్వాత సోయాపాలు పోయాలి. ఖర్జూరం, డ్రైఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఆరగించాలి.
నోట్... దీంట్లో కొవ్వు ఉండదు. ఓట్స్‌లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ప్రొటీన్లు గుండె ఆరోగ్యానికి బలం చేకూరుస్తాయి. సోయాపాలు అందుబాటులో లేకపోతే డైరీ పాలనే వాడుకోవచ్చు. ఇది ఆరోగ్యకరమైన, శక్తినిచ్చే అల్పాహారం.
Comments
Please login to add a commentAdd a comment