బాలీవుడ్ నటి మలైకా అరోరా ఐదు పదుల వయసు దాటినా యువ హిరోయిన్‌లకు దీటుగా అందంగా ఉంటుంది. ఇప్పటికి వయసు 20 అనేలా ఉంటుంది. ఎప్పటికప్పుడూ సరిక్తొత ఫ్యాషన్ డ్రెస్‌లతో తన స్టన్నింగ్ లుక్‌తో మిస్‌మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇంత వయసొచ్చిన ఎక్కడ వృధాప్య ఛాయలు కనపడను కూడా కనపడవు. ఈ ముద్దుగమ్మ ఇంతలా గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి తాను ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో షేర్ చేసింది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్యం తోపాటు అందం మీ సొంతం అని చెబతోంది.
ఇంతకీ ఆమె ఇష్టంగా తీసుకునే బ్రేక్‌ఫాస్‌లు ఏంటంటే..అవకాడోతో చేసిన బ్రేక్ ఫాస్ట్‌లు తీసుకుంటుంది. ఆ అవకాడోతో నిమిషాల వ్యవధిలా ఎలా బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవచ్చో కూడా సవివరంగా తెలిపింది. అవేంటంటే..
క్లాసిక్ అవోకాడో టోస్ట్ : ఇది కేవల పది నిమిషాల్లో రెడీ అయిపోతుందట. కావల్సిందల్లా కేవలం అవకాడో, బ్రెడ్, ఆలివ్ ఆయిల్, మసాల ఉంటే చాలు. చక్కడగా బ్రేడ్‌ని వేయించి అవకాడో చిన్నచిన్న ముక్కలుగా కోసి పెట్టి దానిపై మసాల వేసి తింటే టేస్ట్ అదుర్స్ అని అంటోంది. చాలా ఈజీ రెసీపీ, త్వరితగతిన చేసుకోవచ్చు అని చెబుతోంది మలైకా అరోరా
అవోకాడో ఫెటా చీజ్ టోస్ట్
దీనికి అవకాడో ముక్కలు, పుల్లని పిండి, ఫెటా చీజ్, వేయించిన గుడ్లు ఉంటే చాలు. కేఫ్ స్టైల్ అవకాడో టోస్ట్ సిద్దమయ్యిపోతుంది.
అవోకాడో చియా టోస్ట్
అత్యంత పోషకమైన వంటకాల్లో ఇది ఒకటి. జస్ట్ పదినిమిషాల్లో చేసుకోవచ్చు. నిమిషాల్లో తయారయ్యే వంటకం. కేవలం అవకాడో చియా గింజలు ఉంటే చాలు. రెసిపీ రెడీ అయ్యిపోతుంది.
తురిమిన గుడ్డు అవోకాడో టోస్ట్
ఇక్కడ అవకాడో తురుము, గుడ్లు తురుముతో చేసే రెసిపీ. ఇది మంచి రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు.
వీట్ ఆవకాడో టోస్ట్
గోధుమ పిండి, అవకాడోలతో చేసే వంటకం. అయితే ఇది చేయడానకి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇది కూడా మంచి ఆరోగ్య కరమైన అల్పాహారం అని చెబుతోంది. మలైకా. అంతేగాదు మన రోజువారీ డైట్‌లో బలవర్ధకమైన ఆహారం ఉంటే ఆరోగ్యవంతంగా ఉండటమే గాక మంచి గ్లామర్‌ని కూడా పొందగలుగుతామని చెబుతోంది మలైకా అరోరా.
Comments
Please login to add a commentAdd a comment