
ఒకేసారి నాలుగు టిఫిన్లు...!
ఉద్యోగాలకు వెళ్లే మహిళలకైనా, గృహిణులకైనా ఉదయం లేవగానే ఓ పెద్ద టెన్షన్ మొదలవుతుంది... బ్రేక్ ఫాస్ట్ ఏం తయారు చేయాలా అని. ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో వెరైటీ కోరుతుంటారు. ఒకరు దోశ కావాలంటే.. మరొకరు ఊతప్పం కావాలంటారు. డైటింగ్ చేసే వాళ్లుంటే చపాతీ చేయమంటారు. మరొకరు ఏ ఆమ్లెట్టో కావాలంటారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోవాలంటే బోలెడంత సమయం, అంతకంటే ఎక్కువ శ్రమ. దీనికి చక్కని పరిష్కారం ఈ నాన్‌స్టిక్ ‘మల్టీ స్నాక్ మేకర్’. మామూలుగా అట్లరేకు మీద ఒక సమయంలో ఒక్కటే వేయగలం. కానీ దీనిలో ఒకేసారి దోశ, చపాతీ, ఆమ్లెట్, ఊతప్పం కూడా వేసేసుకోవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. శ్రమా తగ్గుతుంది. వెల రూ.400-500 వరకూ ఉంటుంది!