
భర్త టిఫిన్ తినలేదని..
జీడిమెట్ల (హైదరాబాద్) : భర్త అలిగి, టిఫిన్ చేయకుండా వెళ్లాడని మనస్తాపానికి గురైన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మార్కండేయనగర్‌లో నివాసం ఉండే సంతోష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. కాగా సోమవారం ఉదయం సంతోష్ ఇంట్లో అలిగి టిఫిన్ తినకుండా వెళ్లినట్టు సమాచారం. అయితే ఇది తట్టుకోలేక సంతోష్ భార్య ఉష(28) మధ్యాహ్నం సమయంలో చీరతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ శ్రీనివాస్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇది వెలుగు చూసింది.