‘అల్పాహారం’ ఎలా?.. మెనూ తేల్చకుండానే అమలుకు సన్నద్ధం | KCr Launch Breakfast scheme In Government Schools From Oct 6 | Sakshi
Sakshi News home page

‘అల్పాహారం’ ఎలా?.. విధివిధానాలు, మెనూ తేల్చకుండానే అమలుకు సన్నద్ధం

Published Thu, Oct 5 2023 7:51 AM | Last Updated on Thu, Oct 5 2023 7:59 AM

KCr Launch Breakfast scheme In Government Schools From Oct 6 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ‘అల్పాహారం’ అమలు విధివిధానాల ఖరారు, మెనూపై ఓ స్పష్టత రాకముందే ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో అధికారుల్లో హడావుడి మొదలైంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని దసరా రోజు ప్రారంభిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే వచ్చేవారం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ పథకాన్ని ఈ నెల 6నే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల నుంచి సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అయితే విద్యార్థులకు ఏ రోజు ఏం ఇవ్వాలనే దానిపై అధికారులు స్పష్టతకు వచ్చినట్టు లేదు. మెనూపై రూపొందించిన నివేదికపై ఈవారం మంత్రి సబితతో సంప్రదింపులు జరపాలని భావించారు. మార్పులు చేర్పులపై అధికారుల్లో నూ తర్జనభర్జన జరుగుతోంది. దీంతోపాటు అల్పాహారం అమలుకు విధి విధానాలు, ఏ అధికారులకు ఏ తరహా బాధ్యతలు అప్పగించాలనే దానిపై విద్యా శాఖ ఇంకా ఓ స్పష్టతకు రాలేదు. కార్యక్రమాన్ని హడావుడిగా ప్రారంభించినా, కొద్దిరోజుల పాటు అమలు మాత్రం కష్టమేనని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు విద్యాశాఖ ఉన్నతాధి కారులను సంప్రదించగా, వారు నిరాకరించారు.  
చదవండి: ‘కానిస్టేబుల్‌’ తుది ఫలితాల వెల్లడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement