
బెంగళూరు: మ్యాగీ చేసి పెట్టినందుకు భార్యకు విడాకులిచ్చాడో భర్త. మ్యాగీ చేస్తే విడాకులిచ్చేస్తారా? అనుమానం రావచ్చు. అతనేమో భోజన ప్రియుడు. ఆమెకేమో వంట రాదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... మూడు పూటలూ మ్యాగీ చేసి పెట్టింది. ఇంకేముంది.. ‘నాకీ భార్య వద్దు’ అంటూ విడాకుల కోసం కోర్టుకెళ్లాడు. పరస్పర అంగీకారం కింద విడాకులూ వచ్చాయి.
బళ్లారిలో జరిగిన ఈ ఘటనను మైసూరుకు చెందిన జడ్జి ఎమ్‌ఎల్ రఘునాథ్ ఇటీ వల వెల్లడించారు. ఈ తరం దంపతులు చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్తున్నారంటూ ఆయన బళ్లారిలో ఉండగా పరిష్కరించిన ఈ కేసును ఇటీవల ఓ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఒక్క వంట రాదనే కాదు... ప్లేటుకు ఒక పక్క పెట్టాల్సిన ఉప్పుడబ్బాను మరోపక్క పెట్టారని ఒకరు, వెడ్డింగ్ సూట్ కలర్ బాగలేదని మరొకరు విడాకులు తీసుకున్నారని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment