
ప్రతీకాత్మక చిత్రం
థానే : ఉదయపు అల్పాహారం వండలేదన్న కోపంతో అత్తను చంపిందో కోడలు. ఈ సంఘటన శనివారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని థానే ఖోఫట్ ఏరియాకు చెందిన 39ఏళ్ల స్వప్న కులకర్ణి అనే మహిళ అల్పాహారం తయారు చేయవల్సిందిగా 75ఏళ్ల అంధురాలైన శోభా కులకర్ణి అనే మహిళను కోరింది. అయితే ఆ వృద్ధురాలు అల్పాహారం తయారు చేయటానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన స్పప్న వృద్ధురాలిపై విరుచుకుపడింది.
కత్తితో ఆమెను విచక్షణా రహితంగా పొడిచిచంపింది. అతి దారుణంగా.. దాదాపు 15సార్లు ఆమెను పొడిచింది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం నిందితురాలిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబట్టడానికి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment