
కాబోయే శ్రీమతికి ప్రేమతో...
శ్రీమతి చేతి వంటకు అలవాటు పడిన భర్తలందరూ ఇటు ఓ లుక్కేయండి.
శ్రీమతి చేతి వంటకు అలవాటు పడిన భర్తలందరూ ఇటు ఓ లుక్కేయండి. ఈ ఫొటో చూపించి ‘ఏవండోయ్ శ్రీవారూ... నా కోసం ఓసారి టిఫిన్ చేసి పెట్టండి’ అని అడిగినా అడగొచ్చు. యువ మన్మథుడు అక్కినేని నాగచైతన్య ఎంత సిన్సియర్‌గా వంట చేస్తున్నారో చూశారుగా! కాబోయే శ్రీమతి సమంతకు చైతూ బ్రేక్‌ఫాస్ట్ చేసి పెట్టారు.
ఏదో సండే ఖాళీగా ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేశారనుకోండి.. అందులో పెద్ద గొప్పేముందని అనుకోవచ్చు. చైతూ టిఫిన్ చేసింది ఫ్రైడేనాడు. అదీ షూటింగ్‌కి వెళ్లే ముందు సమంతకు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి వెళ్లారు. దాంతో సమంత ఆనందానికి అవధులు లేవు. ‘‘మోకాళ్ల మీద కూర్చుని దేవుడికి కృతజ్ఞతలు తెలిపా. ఈ ప్రపంచానికి నేనే రాణి అనే భావన కలిగింది’’ అని సమంత సంబరపడిపోయారు. ‘షూటింగ్‌కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ చైతూ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసినప్పుడు... మీరు చేయలేరా’ అని శ్రీమతి అడిగితే ఏం చెప్పాలో ఆలోచించుకోండి. లేదా ఓ గంట ముందు నిద్రలేచి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి రెడీ అవ్వండి. సో, భర్తలందరూ బీ అలర్ట్. మీకిది స్వీట్ వార్నింగ్!