దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్ | Indra Nooyi Breakfast with Chef Vikas Khanna | Sakshi
Sakshi News home page

దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్

Published Tue, Sep 20 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్

దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్

నిరాడంబరంఋ
ఇంద్రానూయి పెప్సీ సీఈవో. ఇండియాలో పేరున్న చెఫ్ వికాస్ ఖన్నా. ఇద్దరూ కలిసి ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఎక్కడా? చెన్నైలో. చెన్నైలోనే ఎక్కడ? ‘నమ్మ వీడు’ అనే నిరాడంబర హోటల్‌లో. నూయీ ఇండియా వచ్చినప్పుడు ఖన్నాకు ఇటీవల ఆమెకు ఆతిథ్యం ఇచ్చే అపూర్వ అవకాశం దక్కింది. ఇంతకీ ఈ ఫుడ్ దిగ్గజాలు ఆ హోటల్‌లో ఏం తిన్నారంటే... అప్పమ్‌లు, పెసరట్టు దోశ, పనియారం, పాయసం, ఉప్మా. అవన్నీ కూడా నూయీ కోసం స్పెషల్‌గా ఖన్నా చేయించినవే. ఆరోగ్యం కోసం చూసుకుంటే రుచి ఉండదనీ, రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ఉండదని మనకో నమ్మకం. అయితే ఖన్నా ఈ రెండిటినీ.. అంటే రుచినీ, ఆరోగ్యాన్నీ మిక్స్ చేసి నూయీ కోసం ఈ ఐటమ్స్ తయారు చేయించారు.

ఇంత మంచి ఫుడ్‌ని తనకు ఆఫర్ చేసినందుకు నూయీ ఫేస్‌బుక్‌లో ఖన్నాకు థ్యాంక్స్ చెబుతూ... వాళ్లిద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఈ ఫొటోను పోస్ట్ చేశారు! స్నాక్స్‌కీ, శీతలపానీయాలకు ప్రసిద్ధి చెందిన పెప్సీ సీఈవో చేత భేష్ అనిపించుకున్నారంటే ఖన్నాను గ్రేట్ చెఫ్ అనే అనాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement