Chef Vikas Khanna
-
‘ఆ ఆటో డ్రైవర్ వివరాలు ఇవ్వండి’
లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా తన వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 79 నగరాల్లోని అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రామలకు ఉచితంగా నిత్యవసరాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న పలు వెబ్సైట్లలో వచ్చిన పుణె ఆటో డ్రైవర్ అక్షయ్ కొథవాలె కథనం వికాస్ ఖన్నాను ఆకర్షించింది. దాంతో ‘ఈ ఆటో డ్రైవర్ చేస్తోన్న పని నాకు చాలా నచ్చింది. నా తరఫున కొంత సాయం చేసి అతడికి మద్దతుగా నిలవాలనుకుంటున్నాను. నాకు అతని వివరాలు ఇవ్వండి’ అంటూ ట్విట్టర్ వేదికగా కోరారు. తన ఈ - మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు వికాస్ ఖన్నా. కొద్ది రోజుల క్రితం తనకు దిబ్బ రొట్టె చేయడం నేర్పిన మాస్టర్ చెఫ్ సత్యం వివరాలు తెలపాల్సిందిగా నెటిజన్లును కోరారు వికాస్ ఖన్నా. వారు స్పందించి సత్యం వివరాలను రీట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.(‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’) This is music to me right now. Thank you @ndtv Can I please find the guy. This man is precious, lets support him. info@vkhanna.com https://t.co/sQF4j8ejhm — Vikas Khanna (@TheVikasKhanna) May 18, 2020 ఇక అక్షయ్ విషయానికి వస్తే ఈ నెల 25 అతడి వివాహం జరగాల్సి ఉంది. అయితే లాక్డౌన్ కారణంగా వివాహం వాయిదా పడింది. దాంతో పెళ్లి కోసం తను దాచిన డబ్బును పేదల ఆకలి తీర్చడం కోసం వినియోగిస్తూ.. మానవత్వం చాటుకుంటున్నాడు. ఓ ఆటో డ్రైవర్‌కు 2లక్షల రూపాయలు అంటే పెద్ద మొత్తమే. అయినా అక్షయ్ ఆ సొమ్మును పేదల కోసం వినియోగించడంతో అతడి మంచి మనసుని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్ చేస్తున్న మంచి పనికి వికాస్ ఖన్నా కూడా ఫిదా అయ్యాడు. (కరోనా ఎఫెక్ట్: డ్రైవరన్నా.. నీకు సలామ్) -
నిన్న గురుదక్షిణ.. నేడు అవార్డు
కరోనా వైరస్ మనిషిలోని మానవత్వాన్ని తట్టి లేపింది. చిన్నదో, పెద్దదో సాయం సాయమే. అందుకే కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి ధనవంతులు, సెలబ్రిటీలు, వ్యాపారస్తులు కోట్లు విరాళాలిస్తే.. పేద, చిరు ఉద్యోగులు తమ సంపాదనలో కొద్ది మొత్తం, ఓ పూట భోజనాన్ని ఇతరులకు పంచారు. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా కూడా తనకు తోచిన రీతిలో పేదలకు సాయం చేస్తూ.. కష్ట కాలంలో ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో వేతన జీవులే నానా ఇక్కట్లు పడుతున్నారు. అలాంటిది ఇక వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు వికాస్ ఖన్నా ముందుకు వచ్చారు. (చదవండి: ‘దిబ్బరొట్టె చేయడం నేర్పినందుకు గురుదక్షిణ’) Please call-check with local old-age homes, orphanages or hospitals in your city if they need dry rations. We are creating a supply chain to help them as much as we can. ❤ Forward info to info@vkhanna.com — Vikas Khanna (@TheVikasKhanna) April 23, 2020 నగరాల్లో ఉన్న వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాలు, ఆస్పత్రులకు నిత్యవసరాలు అందించేందుకు ఓ సప్లై చైన్‌ను రూపొందించారు వికాస్ ఖన్నా. తమను ఆశ్రయించిన వారినకి చేతనైన సాయం చేస్తున్నారు వికాస్ ఖన్నా. తాజాగా తనకు దిబ్బ రొట్టె నేర్పిన గురువు సత్యం వివరాలు తెలుసుకుని మరి గురు దక్షిణ సమర్పించారు. కష్ట కాలంలో వికాస్ ఖన్నా చేస్తున్న కృషిని గుర్తించిన చిల్డ్రన్స్ హోప్ ఇండియా అనే ఎన్జీవో సంస్థ వికాస్‌కు ‘యాక్షన్ హీరో’ అవార్డ్ ప్రకటించింది. ఆన్లైన్ వేదికగా ఈ నెల 16న వికాస్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సదరు సంస్థ తెలియజేసింది. Registrations and donations are steadily coming in and we can't thank you enough. Be part of "Laughter, Love and Compassion" online this Saturday 5/16 and help raise COVID-19 relief funds as we celebrate this year's Action Hero Award winner, Chef Vikas Khanna!@TheVikasKhanna pic.twitter.com/SGZnmsK3N6 — Childrens Hope India (@childrenshopein) May 12, 2020 -
దిగ్గజాల దేశవాళీ బ్రేక్‌ఫాస్ట్
నిరాడంబరంఋ ఇంద్రానూయి పెప్సీ సీఈవో. ఇండియాలో పేరున్న చెఫ్ వికాస్ ఖన్నా. ఇద్దరూ కలిసి ఇటీవల బ్రేక్‌ఫాస్ట్ చేశారు. ఎక్కడా? చెన్నైలో. చెన్నైలోనే ఎక్కడ? ‘నమ్మ వీడు’ అనే నిరాడంబర హోటల్లో. నూయీ ఇండియా వచ్చినప్పుడు ఖన్నాకు ఇటీవల ఆమెకు ఆతిథ్యం ఇచ్చే అపూర్వ అవకాశం దక్కింది. ఇంతకీ ఈ ఫుడ్ దిగ్గజాలు ఆ హోటల్లో ఏం తిన్నారంటే... అప్పమ్‌లు, పెసరట్టు దోశ, పనియారం, పాయసం, ఉప్మా. అవన్నీ కూడా నూయీ కోసం స్పెషల్‌గా ఖన్నా చేయించినవే. ఆరోగ్యం కోసం చూసుకుంటే రుచి ఉండదనీ, రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం ఉండదని మనకో నమ్మకం. అయితే ఖన్నా ఈ రెండిటినీ.. అంటే రుచినీ, ఆరోగ్యాన్నీ మిక్స్ చేసి నూయీ కోసం ఈ ఐటమ్స్ తయారు చేయించారు. ఇంత మంచి ఫుడ్‌ని తనకు ఆఫర్ చేసినందుకు నూయీ ఫేస్బుక్లో ఖన్నాకు థ్యాంక్స్ చెబుతూ... వాళ్లిద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న ఈ ఫొటోను పోస్ట్ చేశారు! స్నాక్స్‌కీ, శీతలపానీయాలకు ప్రసిద్ధి చెందిన పెప్సీ సీఈవో చేత భేష్ అనిపించుకున్నారంటే ఖన్నాను గ్రేట్ చెఫ్ అనే అనాలి.