![Telangana CM KCR Decides To Give Iftar Dinner To Muslim Brothers On 29Th April - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/24/KCR-3.jpg.webp?itok=YxqasdLj)
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడి యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని సీఎం తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తోంది. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment