
ఈద్ ముబారక్
సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచేది రంజాన్.
సమత, మమతల కలయిక, దానధర్మాలకు ప్రతీకగా నిలిచేది రంజాన్. ముస్లిం సోదరులు అత్యంత నిష్ట, భక్తితో జరుపుకునే ఈ పండుగను ఈద్-ఉల్-ఫితర్ అని కూడా అంటారు. జిల్లా వ్యాప్తంగా గురువారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్ర ద్ధలతో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు చేసుకునేందుకు జిల్లాలోని ఈద్గా మైదానాల్లో ఏర్పాట్లు చేశారు. మసీదులన్నీ శోభాయమానంగా ముస్తాబయ్యాయి.