రంజాన్ పురస్కరించుకుని పాతబస్తీలో పర్యటించిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన యాఖత్‌పురా నియోజకవర్గం కుర్మగూడ డివిజన్‌లోని ఓల్డ్ ఈద్గాలో పనులను సందర్శించేందుకు వచ్చారు.డిప్యూటీ మేయర్ రాక సమాచారం లేదని, తమను సంప్రదించకుండా ఎలా వస్తారని స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ డాక్టర్ సమీనా బేగం అధికారులను నిలదీశారు.
రంజాన్‌కు కొన్ని గంటల ముందు వచ్చి ఏ పనులను పరిశీలిస్తారని ఆమె బాబా ఫసీయుద్దీన్‌ను ప్రశ్నించారు. ఈద్గాలోకి ప్రవేశించకుండా ఫసీయుద్దీన్‌ను ఆమె అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఫసియుద్దీన్ బదులిస్తూ ఈద్గా తమ పరిధిలోకి రాదని వక్ఫ్ బోర్డుకు సంబంధమని పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ పరిధిలో ఈద్గాకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనినైనా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన కార్పొరేటర్‌ను సముదాయించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.