
జలీల్‌ఖాన్ అబద్దాలు చెప్పడం తగదు
లబ్బీపేట : పవిత్ర రంజాన్ మాసం లో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పచ్చి అబ ద్దాలు ఆడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్వించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్‌ఖాన్, డబ్బుకు, పదవులకు ఆశపడి అధికార పార్టీలో చేరిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయ డం, జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాడంటూ పవిత్ర రంజాన్ మాసంలో నోటి కొచ్చినట్లు మాట్లాడం ..మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.
ఆ నియోజకవర్గంలో అతని బల మెంతో ..ముస్లింల ఆత్మీయ సమావేశంతోనే తేలిపోయిందన్నారు. ఇక రాజ కీయ భవితవ్యం లేదని తెలుసుకున్న జలీల్‌ఖాన్, పదవుల కోసం అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని డాక్టర్ మెహబూబ్ షేక్ హెచ్చరించారు.