MLA jalilkhan
-
అర్థరాత్రి ఎమ్మెల్యే కుమారుడి హంగామా!
-
జలీల్‌ఖాన్ అబద్దాలు చెప్పడం తగదు
లబ్బీపేట : పవిత్ర రంజాన్ మాసం లో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పచ్చి అబ ద్దాలు ఆడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్వించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్‌ఖాన్, డబ్బుకు, పదవులకు ఆశపడి అధికార పార్టీలో చేరిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయ డం, జగన్ జన్మలో ముఖ్యమంత్రి కాడంటూ పవిత్ర రంజాన్ మాసంలో నోటి కొచ్చినట్లు మాట్లాడం ..మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఆ నియోజకవర్గంలో అతని బల మెంతో ..ముస్లింల ఆత్మీయ సమావేశంతోనే తేలిపోయిందన్నారు. ఇక రాజ కీయ భవితవ్యం లేదని తెలుసుకున్న జలీల్‌ఖాన్, పదవుల కోసం అనవసరంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని డాక్టర్ మెహబూబ్ షేక్ హెచ్చరించారు. -
జలీల్‌ఖాన్ రాజకీయ జీవితం భూస్థాపితమే
బీజేపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ(భవానీపురం) : రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని, ఎవరినైనా విమర్శించేముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ నాయకులకు బీజేపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు హితవు పలికారు. రాష్టంలో బీజేపీ భూస్థాపితం కానుందన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వ్యాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గంలో జలీల్‌ఖాన్ మాత్రం రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయమన్నారు. సూర్యారావుపేటలోని భారతీయ జనతా పార్టీ నగర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని జలీల్‌ఖాన్ నమ్మక ద్రోహి అని, వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకులోనై టీడీపీలోకి మారిన ఆయన దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై టీడీపీ నాయకులు ఎవరి నోటికి వచ్చినట్లు వారు మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంలో మం త్రులు ఆసక్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు. మనకు 24 గంటల కరెంట్ ఇస్తున్నది కేంద్రమేనని ఎక్కడైనా చెబుతున్నారా అని ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు, రాష్ట్ర నాయకులు ఎల్.ఆర్.కె.ప్రసాద్, పి.మాలకొండయ్య, అడపా నాగేంద్రం, బి.ఎస్.కె.పట్నాయక్, ఎం.వీరబాబు, పశ్చి మ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదిలం రాజశేఖర్, నగర ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.అర్ముగం, తోట శివనాగేశ్వరరావు, బబ్బూరి శ్రీరామ్, వి.చంద్రబాబు, డి.శ్రీదేవి, మిల్టన్ జైన్ పాల్గొన్నారు. -
మసీదు కూల్చివేతకు సర్కారు కుట్ర
► ముస్లింల మనోభావాలతో చెలగాటం ► దుర్మార్గానికి ప్రభుత్వం ప్రణాళిక ► బెదిరింపులకు పాల్పడుతున్న ఉన్నతాధికారి ► వత్తాసు పలుకుతున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ముస్లింల మనోభావాలకన్నా తమవారికి అండగా నిలవాలనే నిర్ణయానికి చంద్రబాబు సర్కారు వచ్చింది. అనుయాయుల స్థిరాస్తుల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే క్రమంలో రామవరప్పాడు రైవస్ కాల్వగట్టుపై ఉన్న మసీదును కూల్చివేసేందుకు నిర్ణయించింది. అధికార పదవులకు అర్రులు చాస్తున్న సంబంధిత ప్రజాప్రతినిధులు అడ్డగోలు నిర్ణయాలకు వంతపాడుతున్నారు. ఉన్నతాధికారులు ముస్లిం మత పెద్దలపై బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలున్నందున కూల్చివేయక తప్పదని, అడ్డుచెబితే అడ్డంగా బుక్కయిపోతారనే హెచ్చరికలు చేస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : విజయవాడలోని ఇన్నర్ రింగ్‌రోడ్డు విస్తరణ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మసీదును కూల్చివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ముస్లిం మనోభావాలపై పిడుగు పడుతున్నట్లయింది. పేదలు, ముస్లింల మనోభావాలకు అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదివరకే ప్రకటించారు. బాధిత కుటుంబాలను నేరుగా కలిసి సంఘీభావం కూడా వ్యక్తం చేశారు. స్థాని కులు, మత పెద్దల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జిల్లా ఉన్నతాధికారులను కోరినా ఖాతరుచేయడం లేదనేది సమాచారం. మసీదును కూల్చవద్దని కోరుతున్న వంశీని ఉద్దేశించి ‘అందరికీ సర్దిచెప్పాలని’ సూచిస్తున్నారని తెలిసింది. దీంతో వంశీ నోరు విప్పడంలేదని స్థానిక పెద్దలు అంటున్నారు. ముస్లింలకు అండగా నిలవడమే కాకుండా మసీదును రక్షించి ఆ మత పెద్దల మన్ననలు అందుకోవాల్సిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సీఎం మెప్పుపొందేందుకు మసీదు కూల్చివేతకు పరోక్షంగా సహకరిస్తున్నారనేది వినికిడి. ఈ విషయంలో జలీల్‌ఖాన్‌పై సంబంధితుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఆయన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవలే టీడీపీలో చేరారు. చేరిన కొద్దిరోజుల్లోనే సీఎం వద్ద తనపట్టు నిలుపుకొనేందుకు ముస్లింలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విఫలం కావడంతో ఎలాగైనా ముఖ్యమంత్రి మెప్పుకు ప్రయత్నిస్తున్నారని ముస్లిం మత పెద్దలు గుర్తుచేస్తున్నారు. తమ పవిత్ర దేవాలయమైన మసీదును కూల్చడం ద్వారా ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అధికార పార్టీ ముఖ్య నాయకులు కూడా ఆందోళన చెందుతున్నారు. సుమారు ఏడాది కాలంగా మసీదును రక్షించాలంటూ ముస్లింలు ఎన్నో ఆందోళనలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ నాయకులు అండగా నిలిచారు. మసీదు కూల్చివేతకు నిరసనగా కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులు కె.పార్థసారథి, డాక్టర్ దుట్టా రామచంద్రరావుతో పాటు పలువురు నాయకులు కలిసి రామవరప్పాడులో ఇళ్లు కోల్పోయే బాధితుల వద్దకు పాదయాత్ర నిర్వహించారు. వేలాదిమందికి ఉపాధి లేకుండా చేస్తే ఎలాగంటూ ఆందోళన చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం వారికి వైఎస్సార్ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ గృహాలు కేటాయించింది. ముస్లింలకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరగకూడదని, వారి మనోభావాలకు ఎటువంటి దెబ్బ తగలకూడదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కొన్నాళ్ల కిందట రామవరప్పాడు బాధితులను పరామర్శించిన సందర్భంలో చెప్పారు. మసీదు కూల్చివేయాలనే ఆలోచనకు స్వస్తిపలకాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. బాధితులను పరామర్శించి అవసరమైతే తమ పార్టీ తరఫున బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి బాధితులకు అండగా ఉండడంతో సీఎం కాస్త వెనక్కు తగ్గారు. ఆ తరువాత బాధితులను పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేసి చివరకు వారిని ఖాళీ చేయించారు. మసీదు విషయంలో ముస్లింలు రాజీ పడడం లేదు. రాత్రికి రాత్రి తొలగించే యత్నంలో... మసీదును రాత్రికి రాత్రి తొలగించేందుకు కలెక్టర్ నేతృత్వంలో సీఎం కొందరు అధికారులను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. వారు ఏరోజైనా తొలగించే అవకాశం ఉందనే అనుమానాలు ముస్లిం పెద్దల్లో వ్యక్తమవుతోంది. ఇంతటి దుర్మార్గాన్ని తామెక్కడా చూడలేదని, లౌకిక వ్యవస్థలో ఒక వర్గం మనోభావాలు దెబ్బతీసే చర్యలు మరో వర్గం చేసేందుకు పూనుకోవడం పూర్తిస్థాయిలో నేరం అవుతుందని వారు వాదిస్తున్నారు. తమ వారి ఆస్తులను కాపాడడానికి పేదల ఇళ్లను తొలగించారని, గతంలో రోడ్డు దిశను కూడా మార్చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశం నగరంలోను, శివారు ప్రాంతంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జర్నలిస్ట్‌లపై దాడులను ఉపేక్షించం
సీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ (భవానీపురం) : జర్నలిస్ట్‌లపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. గత శుక్రవారం రాత్రి వన్‌టౌన్‌లోని ముస్లిం శ్మశానవాటిక వివాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కాకతీయ దినపత్రిక బ్యూరో చీఫ్ షేక్ షఫీవుల్లాపై పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల బృందం పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్‌ను కలిసి వినతి పత్రం అందచేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ఘటన పూర్వాపరాలను సీపీకి వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ సమాజ హితాన్ని కోరే జర్నలిస్ట్‌లపై దాడులు వాంఛనీయం కాదన్నారు. దాడి ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ కమిషనర్‌ను కలిసినవారిలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు చావా రవి, నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు. -
జలీల్ఖాన్ను తక్షణమే అరెస్టు చేయాలి: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: కాకతీయ దినపత్రిక సంపాదకులు మహమ్మద్ షఫీపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే జలీల్ఖాన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజే యూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్లు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ జర్నలిస్టులపై దాడికి దిగడం ఇది తొలిసారి కాదన్నారు. వారం క్రితం సాక్షి జర్నలిస్ట్‌పై తన అనుచరులతో కలసి దాడి చేసి కెమెరా ధ్వంసం చేశారని, జర్నలిస్టులను పరుష పదజాలంతో దూషించారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే తీరుపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, జలీల్‌ఖాన్‌పై ఏపీ శాసనసభా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
జలీల్ దౌర్జన్యకాండపై విచారణ
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేత అంజిరెడ్డి ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడ (వన్‌టౌన్) : పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తన అనుచరులతో కలిసి సాక్షి మీడియా ప్రతినిధులపై, వైఎస్సార్ సీపీ నేతలపై సాగించిన దాడిపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. అధికార దాహంతో పార్టీ మారిన జలీల్‌ఖాన్‌కు వైఎస్సార్ సీపీ జారీ చేసిన విప్‌ను అందించటానికి వెళ్లిన క్రమంలో పార్టీ శ్రేణులపై ఆదివారం తన కార్యాలయంలో దాడి చేసి గాయపరిచారు. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపైనా విచక్షణారహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే. గాయపడిన పార్టీ విద్యార్థి విభాగ నగర అధ్యక్షుడు అంజిరెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విప్ పత్రాలను జలీల్‌ఖాన్ అందజేసేందుకు వెళ్లగా ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచారని ఆస్పత్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు వివరాలను వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు పంపించగా కేసు నమోదు చేశారు. వివరాలు సేకరిస్తున్న పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలు, సాక్షి మీడియా ప్రతినిధుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా జలీల్‌ఖాన్ చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ ప్రారంభించారు. జలీల్‌ఖాన్ కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వెళ్లారు, దాడిలో ఎవరు పాల్గొన్నారు, వారి పేర్లను సేకరించినట్లు సమాచారం. జలీల్‌ఖాన్ కార్యాలయంలోకి అనధికారికంగా లోపలకు వెళ్లి ఉంటే విప్ ప్రతిని ఏవిధంగా తీసుకుంటారనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు. మీడియా ప్రతినిధులు కెమేరాలను తన కార్యాలయంలో వదిలి పారిపోయారని జలీల్‌ఖాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. లక్షలాది రూపాయల కెమేరాలను అక్కడ ఎందుకు వదిలి వెళతారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దాడిలో ముస్లిం మేధావుల ఫోరం నేతలు జలీల్‌ఖాన్ కారు డ్రైవర్‌తోపాటు ముస్లిం మేధావుల ఫోరం నేతలు, టీడీపీ నాయకులు అల్తాఫ్, అస్లాంలు మీడియా ప్రతినిధులపై దాడి చేసి గాయపరిచినట్లు ప్రాథమికంగా పోలీసులు ధ్రువీకరించినట్లు సమాచారం. మిగతా వారి గురించి విచారిస్తున్నారు. భౌతిక దాడులు సరికాదు : పీసీసీ నేత ఆకుల మీడియా ప్రతినిధులపై జలీల్‌ఖాన్ భౌతిక దాడులకు తెగబడటంపై పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. స్థానిక మరుపిళ్ల చిట్టి కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జలీల్‌ఖాన్ ఏ పార్టీ ఓట్లతో గెలిచారో దానిని కాదని బయటకు వచ్చినప్పుడు రాజీనామా చేయటం పద్ధతి అని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ముస్లింల ఝలక్!
⇒అది ఆత్మీయ సమ్మేళనం కాదు.. టీడీపీ రాజకీయ సభ ⇒ఢిల్లీలోని ముస్లిం పెద్దలకు ఫిర్యాదుల పరంపర ⇒విజయవాడ వచ్చే విషయంలో ఢిల్లీ గురువు పునరాలోచన ⇒ముస్లిం తెగల మధ్య చిచ్చుపెట్టే జలీల్ తీరుపై మండిపాటు విజయవాడ బ్యూరో : ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తీరుపై ముస్లింలు మండిపడుతున్నారు. అవసరార్థం వాడుకుని వదిలేసే జలీల్‌కు ముస్లింలు ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 30 ఏళ్ల రాజ కీయ జీవితంలో పార్టీలను, తన జాతిని అవసరార్థం అడ్డంపెట్టుకునే ఆయన నైజంపై గుర్రుగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పూరించిన కాపు గర్జనను చూసి ముస్లిం గర్జన అంటూ హడావుడి చేసిన జలీల్‌ఖాన్ పచ్చకండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి పదవి, కాకుంటే వక్ఫ్ చైర్మన్ పదవి సాధించుకునేందుకు ఆత్మీయ సమ్మేళనాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తుండటంపై ముస్లింలు గుర్రుగా ఉన్నారు. కేవలం తన రాజకీయ పరపతి కోసమే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని బహిష్కరించి జలీల్‌కు గట్టి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు సమాచారం. బలం లేకే గాంధీజీ కళాశాల ఎంపిక... విజయవాడ వన్‌టౌన్‌లోని గాంధీజీ మహిళా కళాశాల ఆవరణలో ఏప్రిల్ రెండున ఆత్మీయ సమ్మేళనానికి జలీల్ ఏర్పాట్లు చేసుకున్నారు. వాస్తవానికి ఒక్క పశ్చిమ నియోజకవర్గంలోనే 60 వేల మంది, విజయవాడ నగరంలో సుమారు లక్షా 50 వేల మంది ముస్లింలు ఉన్నట్టు అంచనా. 13 జిల్లాల నుంచి ముస్లింలు తరలివస్తారని జలీల్‌ఖాన్ ప్రచారం చేస్తున్నారు. అదే వాస్తవమైతే బెజవాడ నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్ కూడా సరిపోదు. కానీ కేవలం రెండు నుంచి మూడు వేల మందికి సరి పోయే గాంధీజీ కళాశాలను ఎంచుకున్నారంటే జలీల్‌ఖాన్ బలం ఏమిటో అర్థమవుతోంది. కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంతో ట్రాఫిక్‌ను వన్‌టౌన్ మీదుగా మళ్లించారు. అసలే ఇరుకు రోడ్లు ఉండే వన్‌టౌన్‌లో కొద్దిపాటి వాహనాలు వచ్చినా నిత్యం ట్రా ఫిక్ జామ్ అవుతుంది. అలాంట ప్పుడు జలీల్ బలప్రదర్శన సభకు పోలీసులు ఎలా అనుమతించారన్నది వారికే తెలియాలి. ఢిల్లీ పెద్దకు ఫిర్యాదుల పరంపర... జలీల్‌ఖాన్ తీరుపై ఢిల్లీలోని ముస్లిం పెద్దలకు ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ముస్లింలలో ఉన్న ఆరు ప్రధాన తెగలను విస్మరించి జమాతే ఉలేమాయే హింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై మిగిలిన వారికి మింగుడు పడటంలేదు. దీంతో అతి పవిత్రమైన ఆధ్యాత్మిక సదస్సు అని పేరు పెట్టి టీడీపీ రాజకీయ సభగా దీన్ని నిర్వహించడాన్ని వారు తప్పుబడుతున్నారు. టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ తనకు మంత్రి పదవి కోసం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పెట్టి అందుకు ఢిల్లీలోని మత పెద్దను ఆహ్వానించడాన్ని వారు తప్పుబడుతున్నారు. అయితే అసలు విషయాలను ఇక్కడి ముస్లిం పెద్దలు ఢిల్లీ ముస్లిం పెద్దలకు చేరవేయడంతో మత పెద్ద దృష్టికి వెళ్లింది. ఆధ్యాత్మిక కార్యక్రమం పేరుతో టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అక్కడ ఇస్లాం జెండాలకు బదులు పసుపు పచ్చ జెండాలు పెడుతున్నారని పలువురు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. దీంతో గత రెండు రోజులుగా జమాతే ఉలేమాయే ప్రతినిధులు విజయవాడ వచ్చి వివరాలు తెలుసుకుని ఢిల్లీ పెద్దకు చెప్పడంతో వారు పునరాలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఆయన రాకుంటే తన పరువు పోతుందని, ఎలాగైనా రప్పించాలని జలీల్‌ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకరిని ఎదగనీయకుండా... జలీల్ఖాన్ది ఆది నుంచి అవకాశవాదమేనని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో పదవుల కోసం, పట్టు కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లి, అటు తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన జలీల్ తీరుపై పశ్చిమ నియోజకవర్గ ముస్లిం లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవరి అండతో ఎదిగితే వారినే తిట్టే నైజం ఆయనది. చివరకు సొంత కులానికి చెందిన వారి ఎదుగుదలను కూడా తట్టుకోలేరనడానికి అనేక సందర్భాలున్నాయి. గతంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లికా బేగం ఓటమికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కారణమయ్యారు. టీడీపీలో చేరిన జలీల్ ఇప్పుడు నాగుల్‌మీరా రాజకీయ ఉన్నతికి అవరోధంగా మారారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీకి ఎన్నో సేవలు అందించిన ఎమ్మెల్సీ ఎంఏ అన్సారీ (నరసాపురం) మంత్రి పదవికి పోటీ వస్తాడనుకుని ఇప్పుడు ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో ఆయనకు కనీస ప్రాధాన్యత లేకుండా జలీల్ జాగ్రత్త పడుతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ముస్లింలకు ఆయన చేసింది ఏమీలేకపోగా అవకాశం వచ్చినప్పుడు వారిని దెబ్బతీసేందుకే ఆయన ఎత్తులు వేయడంతో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. -
మీడియాపై దాడి అమానుషం
సాక్షి సిబ్బందిపై దాడికి జర్నలిస్టు సంఘాల ఖండన విజయవాడ : విజయవాడలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సమక్షంలో కొందరు వ్యక్తులు మీడియా ప్రతినిధులపై దాడిచేయటాన్ని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యుజే అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జి.రామారావు, దారం వెంకటేశ్వరరావు ఒక సంయుక్త ప్రకటనలో ఖండించారు. ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో సాక్షి ఫొటో జర్నలిస్టు ఐ.సుబ్రమణ్యం, టీవీ వీడియో జర్నలిస్టు సంతోష్‌లపై జలీల్‌ఖాన్ అనుచరులు దాడి చేయటం శోచనీయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా ప్రతినిధులను చితకబాది కెమెరాలు లాక్కోవటం దారుణమన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి చట్టప్రకారం కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలి వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సాక్షి’ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. జలీల్ఖాన్లో తీవ్ర అభద్రతా భావం నెలకొంది. వైఎస్సార్సీపీ జారీ చేసిన విప్‌ను అందజేయడానికి పార్టీ నేతలు వెళితే ఆ వార్త కవరేజీ కోసం వెళ్లిన కెమెరామేన్లపై జలీల్‌ఖాన్ అరవడం, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన సిబ్బంది దాడి చేయడం గర్హనీయం. ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియాపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. రాజకీయ పార్టీలతో జలీల్‌ఖాన్ విభేదించవచ్చు కానీ, మీడియా ప్రతినిధులతో విభేదించడం సరికాదు. జలీల్‌ఖాన్ తనవెంట పార్టీ కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా రాకపోవడంతో తన ప్రతిష్ట దెబ్బతిందని తీవ్ర అవమానంగా భావిస్తున్నట్లు కనబడుతున్నారు. అందువల్లే కెమెరామేన్లపై దాడికి పాల్పడ్డారు. రాజధానిగా మారిన విజయవాడలో ఇటువంటి ఘటనలు జరగడం అమానుషం. దీనివల్ల రాజకీయ నాయకులపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది. దాడి చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి. జలీల్‌ఖాన్ తక్షణం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. జలీల్‌ఖాన్ రాజీనామా చేయాలి లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ విజయవాడ నగర ఇన్చార్జి పార్టీ మారిన జలీల్‌ఖాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, విప్ తీసుకోకుండా నిరాకరించటం, దౌర్జన్యకరంగా వ్యవహరించటం గర్హనీయం. విప్ జారీ చేయటానికి వెళ్లిన విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అంజిరెడ్డిపై, సాక్షి మీడియా కెమెరామేన్లు సుబ్రహ్మణ్యం, సంతోష్‌లపై జలీల్‌ఖాన్ అనుచరులు దాడి చేయటం దారుణం. ఈ ఘటనకు పాల్పడ్డ ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులను ప్రతిఒక్కరూ ఖండించాలి. టీడీపీ హయాంలో మీడియాపై దాడులు పెచ్చుపెరిగాయి. విప్ తీసుకోకుండా దాడికి పాల్పడటం దారుణం : కొడాలి నాని, వైఎస్సార్సీపీ తూర్పు కృష్ణా అధ్యక్షుడు పార్టీ జారీ చేసిన విప్ తీసుకోకుండా పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అనుచరులు దాడికి పాల్పడటం దారుణం. పార్టీ ఫిరాయించిన జలీల్‌ఖాన్ పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదు. విప్ ఇవ్వటానికి వెళ్లిన కార్యకర్తలపై దౌర్జన్యం చేసి, మీడియా ప్రతినిధుల నుంచి కెమెరాలు లాక్కుని బీభత్సం సృష్టించారు. జలీల్‌ఖాన్, అతని అనుచరులు దాడికి పాల్పడింది గాక ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అండ చూసుకుని జలీల్‌ఖాన్ అనుచరులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ కేసులో పోలీసులు చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి. పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరపాలి. దాడి వెనుక ప్రభుత్వ హస్తం ఉంది కొలుసు పార్ధసారథి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు విప్ జారీ చేయటానికి వెళ్లిన పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు డి.అంజిరెడ్డిపై, సమాచారాన్ని సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం వెనుక టీడీపీ ప్రభుత్వ హస్తం ఉంది. విప్ జారీకి వెళ్లిన పార్టీ కార్యకర్తలపై దాడి జరగటం, కెమెరాలు లాక్కుని మీడియా ప్రతినిధులను కొట్టటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. తెలుగుదేశం హయాంలో రౌడీయిజం పెచ్చుపెరిగిందని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఘటనలు జరగటం అత్యంత హేయం. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. -
జలీల్‌కు దేహశుద్ధి తప్పదు
సీపీఐ, సీపీఎం నేతల హెచ్చరిక గొల్లపాలెంగట్టు (వించిపేట) : కొండ ప్రాంత ప్రజల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎమ్మెల్యేకు ప్రజలే దేహశుద్ధి చేస్తారని సీపీఐ, సీపీఎం నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. నగర వ్యాప్త ఉద్యమంలో భాగంగా సీపీఐ, సీపీఎం నగర కమిటీల అధ్వర్యంలో మంగళవారం గొల్లపాలెంగట్టు నుంచి నైజాంగేటు మీదుగా ప్రైజర్‌పేట వరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయత్రలో పాల్గొన్న సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నగరంలోని కొండ నివాసితులకు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కల్పిస్తామని, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తామని వాగ్దానం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ విషయాన్ని మరచి భూములను కొల్లగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఒక పార్టీ గుర్తుపై గెలిచి ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా తన స్వలాభం కోసం అధికార పార్టీలో చేరి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేశారన్నారు. మంత్రి పదవుల కోసం పార్టీలు మారేవారు ముందు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి గెలవాలని పేర్కొన్నారు. సీపీఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి గెలిపించిన నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మోసగించి తన ఆస్తులను పెంచుకునేందుకు అధికార పార్టీలో చేరారని ఆరోపించారు. ముంపు ప్రాంతమైన వన్‌టౌన్‌లో ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడాజరగలేదన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టిసారించకపోతే ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ నెల 22న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి కట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రలో స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మి, బోయి సత్యబాబు, కొండారెడ్డి, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, తాడి పైడియ్య, దేవుడమ్మ పాల్గొన్నారు.