
Eid Mubarak : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలన్నారు. ఈ మేరకు ఈద్ గెటప్‌లో ఓ వీడియోని విడుదల చేశారు బాలకృష్ణ
‘ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవానిరతి మారుపేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్దలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణతోపాటు మరికొందరు తెలుగు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment