
ముస్లింలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలు పవిత్ర రంజాన్ సోమవారం జరుపుకోనున్నారు. సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సమరస్యానికి, సుహృద్భావానికి, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని జగన్ ఆకాంక్షించారు.
ఆదివారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కనిపించడంతో ఈద్ ఉల్ ఫితర్‌ను సోమవారం జరుపుకోవాలని మత పెద్దలు నిర్ణయించారు. దీంతో నెలరోజులుగా పాటిస్తోన్న ఉపవాస దీక్షలకు ముస్లింలు ముగింపు పలికారు. రేపే రంజాన్ కావడంతో హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో సందడి నెలకొంది.