
కనిపించిన నెలవంక, రేపే రంజాన్
హైదరాబాద్: ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని శనివారం జరుపుకోనున్నారు. శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించింది. దీంతో రేపు రంజాన్ను జరుపుకోవాలని రోహిత్-ఎ-ఇలాల్ కమిటీ ప్రకటించింది.
రంజాన్ పర్వదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.