శని, ఆదివారాల్లో భద్రాద్రికి పోటెత్తనున్న భక్తజనం ఊ 10 లక్షల మంది వస్తారని అంచనా..
భద్రతా ఏర్పాట్లలో మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ ఊ అదనపు బలగాలను రప్పిస్తున్న అధికారులు
మిథిలా స్టేడియంలో ప్రత్యేక దర్శనాలు ఊ వీఐపీలు ఆ రెండు రోజులు రావద్దు..
భద్రాచలంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మూడు రోజులపాటు విజయవంతంగా పుష్కరాలను నిర్వహించిన అధికారులు శని, ఆదివారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ నుంచి భక్తుల తాకిడి అధికమైంది. అయితే శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా, ఆదివారం సెలవు రోజులు కావడంతో రోజుకు 5 లక్షల మంది చొప్పున రెండు రోజుల్లో పది లక్షల మంది భక్తులు భద్రాచలానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ షానవాజ్ ఖాసీంలు గురువారం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
-భద్రాచలం నుంచి సాక్షి ప్రతినిధి బొల్లం శ్రీనివాస్
ఆ రెండు రోజులు హైటెన్సన్
Published Fri, Jul 17 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM
Advertisement