
రోజూ రోజా!
రంజాన్ మాసం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ‘హలీమ్’. మటన్ హలీమ్, చికెన్ హలీమ్‌తో పాటు ఇప్పుడు వెజిటెబుల్ హలీమ్ కూడా తయారు చేస్తున్నారనుకోండి.
రంజాన్ మాసం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది ‘హలీమ్’. మటన్ హలీమ్, చికెన్ హలీమ్‌తో పాటు ఇప్పుడు వెజిటెబుల్ హలీమ్ కూడా తయారు చేస్తున్నారనుకోండి. ఆ విధంగా శాకాహారులకు కూడా హలీమ్ టేస్ట్ చేసే అవకాశం దక్కుతోంది. ఇక, ఈ మాసంలో ముస్లిమ్ సోదర, సోదరీమణులు ఉపవాసం ఉంటారనే విషయం తెలిసిందే. దీన్ని ‘రోజా’ అంటారు. ప్రతి ఏడాదీ రంజాన్ మాసంలో ప్రతి రోజూ టబు రోజా ఆచరిస్తారు. అందుకు తగ్గట్టుగా తన దినచర్యను ప్లాన్ చేసుకుంటారామె.
షూటింగ్స్ అంటే రద్దు చేసుకోవడానికి కుదరదు కాబట్టి, ప్రచార కార్యక్రమాలను మాత్రం రోజాకి అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. తాజాగా మలయాళ ‘దృశ్యం’కి రీమేక్‌గా టబు నటించిన హిందీ ‘దృశ్యం’ వచ్చే నెల విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రోజంతా ఉపవాసం ఉంటారు కాబట్టి, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించుకున్న తర్వాత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తప్పనిసరి అయితేనే డే టైమ్ ప్రోగ్రామ్స్‌కి టబు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారట.