సాక్షి, హైదరాబాద్: రంజాన్ ఉపవాసంలో ఉండి కోవిడ్–19 వ్యాక్సిన్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఉపవాసానికి వచ్చిన నష్టమేమి లేదని హైదరాబాద్‌కు చెందిన దారుల్ ఇఫ్తా సంస్థ ముస్లింలకు సలహా(ఫత్వా) జారీ చేసింది. గొంతు మార్గం ద్వారా వ్యాక్సిన్ కడుపులోకి చేరదని, దీంతో ఉపవాస దీక్షలో ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చని సూచించింది.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన సందర్భాల్లో ఉపవాసాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, ఉపవాస దీక్షను తర్వాత వీలును బట్టి మరో రోజు చేపట్టాలని కోరింది. ఏప్రిల్ 14 నుంచి దేశంలో రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఉపవాస దీక్షలో ఉండి వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈ సంస్థ జారీ చేసిన సలహా దోహదపడనుంది.
చదవండి:
మంత్రి నిరంజన్‌రెడ్డికి కరోనా పాజిటివ్
కరోనా ఉధృతి : టీకా కోసం పడిగాపులు
Comments
Please login to add a commentAdd a comment