consumer durables
-
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్‌బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్‌లు మేక్మైట్రిప్, క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్‌లో 65 శాతం మంది, జెన్ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
సీపీఐ పుష్.. మార్కెట్ రికార్డ్స్
ముంబై: గత నెలలో సీపీఐ ఆర్బీఐ లక్ష్యం 6 శాతానికంటే తక్కువగా 4.75 శాతానికి దిగిరావడంతో వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు లాభాల మధ్యే కదిలాయి. వెరసి సెన్సెక్స్ 204 పాయింట్లు ఎగసి 76,811 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 539 పాయింట్లు జంప్‌చేసింది. ఇక నిఫ్టీ 76 పాయింట్లు పుంజుకుని 23,399 వద్ద స్థిరపడింది. తొలుత 158 పాయింట్లు ఎగసి 23,481ను తాకింది. ఇవి సరికొత్త రికార్డులుకావడం విశేషం! కాగా.. తాజా సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల యథాతథ కొనసాగింపునకే కట్టుబడింది. ద్రవ్యోల్బ ణం తక్కువగానే నమోదవుతున్నప్పటికీ ఈ ఏడాది వడ్డీ రేట్లలో ఒకసారి మాత్రమే కోత విధించవచ్చని పేర్కొనడం గమనార్హం! రియల్టీ అప్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియలీ్ట, క న్జూమర్ డ్యురబుల్స్, ఐటీ 2.2–1% మధ్య బలపడగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ 1% స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో శ్రీరామ్ ఫైనాన్స్ 5% జంప్‌చేయగా.. ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్, టైటన్, ఎల్టీఐఎం, ఇండస్ఇండ్, టెక్ఎం, టీసీఎస్, విప్రో, అ్రల్టాటెక్ 3–1 మధ్య లాభపడ్డాయి. అయితే హెచ్‌యూఎల్, యాక్సిస్, పవర్‌గ్రిడ్, బ్రిటానియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, ఐసీఐసీఐ 1.6–1% మధ్య క్షీణించాయి. మార్కెట్ క్యాప్ @ 431.67 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. గత రెండు రోజుల్లో రూ. 4.72 లక్షల కోట్లు జమకావడంతో రూ. 431.67 లక్షల కోట్లను(5.17 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. ఇంట్రాడేసహా ముగింపులోనూ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 77,145 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 23,481కు చేరింది. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. -
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
పారిశ్రామికోత్పత్తి డౌన్
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి మార్చిలో మందగించింది. విద్యుత్, తయారీ రంగాల పేలవ పనితీరుతో అయిదు నెలల కనిష్టానికి పడిపోయి.. 1.1%గా నమోదైంది. చివరిసారిగా 2022 అక్టోబర్‌లో అత్యంత తక్కువ స్థాయి వృద్ధి నమోదైంది. అప్పట్లో ఐఐపీ 4.1% క్షీణించింది. గతేడాది మార్చిలో ఇది 2.2% కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8%గా ఉంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) డేటా ప్రకారం ... ► విద్యుదుత్పత్తి రంగం 6.1 శాతం వృద్ధి నుండి 1.6 శాతం క్షీణత నమోదు చేసింది. ► తయారీ రంగం వృద్ధి 1.4 శాతం నుంచి 0.5 శాతానికి నెమ్మదించింది. ► మైనింగ్ రంగం ఉత్పత్తి 3.9 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 2.4 శాతం నుంచి 8.1 శాతానికి ఎగిసింది. ► ప్రైమరీ గూడ్స్ వృద్ధి గత మార్చిలో 5.7% ఉండగా ప్రస్తుతం 3.3%గా నమోదైంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 3.1 శాతం నుంచి మైనస్ 8.4 శాతానికి పడిపోయింది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ తాజాగా మైనస్ 3.1%కి చేరింది. ► ఇన్ఫ్రా/ నిర్మాణ ఉత్పత్తుల వృద్ధి 5.4 శాతంగా ఉంది. గత మార్చిలో ఇది 6.7 శాతం. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఐఐపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 11.4%. -
‘ప్రీమియం ఉత్పత్తులకు’ సై!
న్యూఢిల్లీ: పండుగల విక్రయాలు జోరుగా సాగాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీల అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రీమియం (ఖరీదైన), మధ్య శ్రేణి ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు విక్రయాలకు అడ్డుపడకపోవడం వాటిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు విలువ పరంగా 30 శాతం, సంఖ్యా పరంగా 20 శాతం వృద్ధిని చూసినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) ప్రకటించింది. ‘‘ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు మంచిగా సాగాయి. మధ్యశ్రేణి నుంచి ఖరీదైన ఉత్పత్తుల వరకే చూస్తే అమ్మకాల్లో 30 శాతం, విలువలో 40–50 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా పండుగల చివరి మూడు రోజుల్లో ఎక్కువ డిమాండ్ కనిపించింది’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. కానీ, ఆరంభ ధరల్లోని ఉత్పత్తుల అమ్మకాలు ఈ పండుగల సీజన్లో 10–15 శాతం తగ్గినట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒత్తిళ్లు ఒక కారణం అయితే, కొందరు వినియోగదారులు ఆరంభ స్థాయి నుంచి తదుపరి గ్రేడ్ ఉత్పత్తులకు మారిపోవడం మరో కారణమని వివరించారు. ఖరీదైన వాటికి ఆదరణ.. ఖరీదైన గృహోపకరణాలకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్యానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియసు ఫుజిమోరి తెలిపారు. ఈ పండుగ సీజన్లో ఏసీలు, పెద్ద తెరల టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విక్రయాలు డబులు డిజిట్లో పెరుగుతాయన్న అంచనాతో ఉన్నట్టు చెప్పారు. ‘‘విలువ పరంగా చూస్తే ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. ఎల్ఈడీ టీవీల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. 4కే టీవీల అమ్మకాల్లో అయితే ఏకగా 34 శాతం వృద్ధి కనిపించింది. టాప్లోడ్ వాషింగ్ మెషిన్లలో 13 శాతం అధిక వృద్ధి నమోదైంది’’అని ఫుజిమోరి వివరించారు. విద్యుత్‌ను ఆదా చేసే ఏసీలు, వినియోగం సులభంగా ఉండే ఉత్పత్తులకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ వృద్ధి ఇలాగే స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో అధిక వృద్ధి ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హెచ్‌యూఎల్ ఎండీ సంజీవ్ మెహతా స్పందిస్తూ.. సెప్టెంబర్ త్రైమాసికంలో విక్రయాలు ఇటీవలి కాలంలోనే ఎక్కువగా నమోదైనట్టు చెప్పారు. దీపావళి తర్వాత విక్రయాల తీరును కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. తక్కువ ధరల వాటితో పోలిస్తే ప్రీమియం ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పాపులర్ బ్రాండ్ల కంటే మించి ఉన్నాయి. అలాగే, చౌక ఉత్పత్తులతో పోలిస్తే పాపులర్ ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి’’అని సంజీవ్ మెహతా వివరించారు. ప్రీమియం విభాగంలో వృద్ధి ఎక్కువగా ఉండడం ప్రజల వద్ద ఖర్చు పెట్టే ఆదాయం పెరిగిందనడానికి సూచనగా పేర్కొన్నారు. -
పండుగ విక్రయాలపై భారీ ఆశలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి. ప్యానాసోనిక్, ఎల్జీ సోనీ, శామ్సంగ్, హయ్యర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పథకాలు, ఆఫర్లు.. పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి. బెడిసి కొట్టదుగా..? ‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్లో స్మార్ట్ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్ డిజిట్ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయర్ వెల్లడించారు. ఎల్జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్ మెషిన్లకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. -
రూ.1 లక్ష కోట్లకు గృహోపకరణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంజ్యూమర్ డ్యూరబుల్స్ (గృహోపకరణాలు) విపణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో రూ.1 లక్ష కోట్ల మార్కును చేరుతుందని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ‘కోవిడ్ ముందస్తు స్థాయితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. వినియోగదార్లు అధిక సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ల వైపు మళ్లుతున్నారు. ఏసీల విషయంలో కాంపాక్ట్ మోడళ్లకు గిరాకీ పెరిగింది. పెద్ద సైజు టీవీల పట్ల కస్టమర్లలో మోజు అధికం అయింది. ఇక రాగి, అల్యూమినియం, స్టీల్, పాలీప్రొపైలీన్ వంటి ముడిపదార్థాల వ్యయం భారం అయినందున లాభాలపై ఒత్తిడి ఉన్నప్పటికీ పరిమాణం పరంగా పరిశ్రమ 2022–23లో రెండంకెల వృద్ధి సాధిస్తుంది. రూపాయి విలువ తగ్గడం కూడా లాభాల క్షీణతకు కారణం అవుతోంది. 45–50 శాతం ముడిపదార్థాలు దిగుమతి అవుతున్నవే. ఇక పరిమాణం 10–13 శాతం దూసుకెళ్లడం ద్వారా ఆదాయం 15–18 శాతం ఎగుస్తుంది. 2021–22లో విలువ పరంగా పరిశ్రమ కోవిడ్ ముందస్తు స్థాయికి చేరుకుంది. పట్టణవాసుల ఆదాయం పెరగడం, వ్యవసాయ ఉత్పత్తుల ధర అధికం కావడంతో డిమాండ్‌ను పెంచుతుంది’ అని నివేదిక వివరించింది. -
యురేకా ఫోర్బ్స్‌కు షాపూర్జీ టాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ నుంచి నిర్మాణ రంగ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ పూర్తిగా బయటపడింది. కంపెనీలో మిగిలిన 8.7 శాతం వాటాను కొత్త యాజమాన్య సంస్థ లునోలక్స్కు విక్రయించింది. పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు చెందిన లునోలక్స్ 1.68 కోట్ల ఈక్విటీ షేర్లను(8.7 శాతం వాటా) షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ నుంచి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని యురేకా ఫోర్బ్స్ తాజాగా వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 19న కుదిరిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం ఈ లావాదేవీని షాపూర్జీ పల్లోంజీ పూర్తి చేసినట్లు పేర్కొంది. షాపూర్జీ నుంచి రూ. 4,400 కోట్లకు యురేకా ఫోర్బ్స్‌ను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ ఇంటర్నేషనల్ గతేడాది సెప్టెంబర్‌లో డీల్‌ను కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్‌లో యురేకా ఫోర్బ్స్ నుంచి షాపూర్జీకి చెందిన ఏడుగురు డైరెక్టర్లు బోర్డు నుంచి తప్పుకోగా.. ఈ వారం మొదట్లో జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ మాజీ సీఈవో ప్రతీక్ పోటాను చీఫ్‌గా యాడ్వెంట్ ఎంపిక చేసింది. ప్రతీక్ ఆగస్ట్ 16 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఎల్జీ నుంచి ఎల్ఈడీల కొత్త శ్రేణి
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యూరబుల్స్ దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తాజాగా 2022 ఓఎల్ఈడీ టీవీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిలో 106 సెం.మీ. (42 అంగుళాలు) నుంచి 246 సెం.మీ. (97 అంగుళాల) వరకూ విస్తృత స్థాయిలో మోడల్స్ ఉన్నాయని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా డైరెక్టర్ హక్ హ్యున్ కిమ్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద (223 సెం.మీ.) 8కే ఓఎల్ఈడీ టీవీ, మార్కెట్లోనే తొలి రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ వీటిలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ధర శ్రేణి రూ. 89,990 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ రేటు రూ. 75,00,000 స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. కొత్త ఓఎల్ఈడీ టీవీల్లో గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమ్ ఆప్టిమైజర్ మెనూ, నాణ్యమైన పిక్చర్, డాల్బీ విజన్, అప్‌గ్రేడ్ చేసిన యూఎక్స్, అల్ఫా9 జెన్ 5 ఇంటెలిజెంట్ ప్రాసెసర్ మొదలైన ఫీచర్లు ఉంటాయని కిమ్ వివరించారు. -
ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు.. మోత మోగడం ఖాయం.. కారణం ఏంటంటే?
న్యూఢిల్లీ: టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ నెల చివరి నాటికి లేదంటే జూన్ మొదటి వారంలో ధరలను 3 నుంచి 5 శాతం మేర పెంచనున్నట్టు కంపెనీల వర్గాలు తెలిపాయి. తయారీ వ్యయాలు పెరిగిపోవడం కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపిస్తోంది. వీటి తయారీకి కొన్ని విడిభాగాలను ఆయా కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి విలువ క్షీణత కారణంగా ఈ దిగుమతుల వ్యయాలు ఇప్పుడు కంపెనీలకు భారంగా మారాయి. కీలక విడిభాగాల్లో ఎక్కువ వాటి కోసం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విదేశాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చైనా వీటిని సరఫరా చేస్తుంటుంది. చైనాలో కరోనా వైరస్ కేసుల నియంత్రణకు కఠిన లాక్డౌన్లు అమలవుతున్నాయి. దీంతో షాంఘై పోర్ట్‌లో భారత్‌కు రావాల్సిన కంటెయినర్లు పేరుకుపోయాయి. ఫలితంగా విడిభాగాల కొరత కూడా నెలకొని ఉంది. ఈ పరిణామాలతో తయారీదారుల వద్ద తగినన్ని నిల్వలు ఉండడం లేదు. తయారీలో అధిక శాతం విడిభాగాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభించని పరిస్థితి నెలకొందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. రూపాయి నొప్పి.. డాలర్‌తో రూపాయి విలువ మరింత క్షీణించడం తమకు సమస్యగా మారినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) చెబుతోంది. ‘‘తయారీ ముడి పదార్థాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు యూఎస్ డాలర్ పెరుగుతూ పోతుంటే రూపాయి తగ్గుతోంది. తయారీదారులు అందరూ ఇప్పుడు తమ లాభాలపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. జూన్ నుంచి ధరలు 3–5 శాతం మేర పెరుగుతాయి’’అని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల, వాషింగ్ మెషిన్లు ఇలా అన్ని రకాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఏసీల తయారీ సంస్థలు మే నెలలో ఇప్పటికే ధరలను పెంచాయి. మరి కొన్ని కంపెనీలు మే చివరికి లేదా జూన్ మొదట్లో ధరలను పెంచాలనుకుంటున్నాయి. రూపాయి కోలుకుంటే..? ‘‘దిగుమతి చేసుకునే విడిభాగాలకు చెల్లింపులు చేయడం త్వరలోనే మొదలు కానుంది. డాలర్ కనుక రూపాయితో 77.40 స్థాయిలోనే ఉంటే మేము కచ్చితంగా ధరలను సవరించుకోక తప్పదు. ఒకవేళ యూఎస్ డాలర్ వచ్చే రెండు వారాల్లో కనుక తిరిగి 75 వద్ద స్థిరపడితే ధరల్లో సర్దుబాటు చేయబోము’’అని ఎరిక్ బ్రగంజ తెలిపారు. తయారీ వ్యయాలపై ఒత్తిడులు కొనసాగూనే ఉన్నట్టు ప్యానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా సీఈవో మనీష్ శర్మ తెలిపారు. ఈ భారం కస్టమర్లపై పరిమితంగా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ‘‘చివరిగా 2022 జనవరిలో రేట్లను పెంచాం. కమోడిటీల ధరలు పెరగడంతో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు ఇలా అన్ని విభాగాల్లోని ఉత్పత్తులపై మరో 3–5 శాతం మేర ధరలు ప్రియం కావచ్చు’’అని మనీష్ శర్మ వివరించారు. బ్లౌపంక్ట్, థామ్సన్, కొడాక్, వైట్ వెస్టింగ్‌హౌస్ తదితర అంతర్జాతీయ బ్రాండ్ల లైసెన్సింగ్ కలిగిన సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఎస్పీపీఎల్) సైతం టీవీ ఉత్పత్తులపై ధరలు పెరుగుతాయని ధ్రువీకరించింది. ‘‘2022లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. యుద్ధం మొదలుకొని, కరోనా కారణంగా చైనాలో లాక్డౌన్లు, ఇప్పుడు యూఎస్ డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వరకు.. వీటి కారణంగా బ్రాండ్లు తమ ఉత్పత్తుల తయారీకి కావాల్సిన విడిభాగాలను సమీకరించుకోవడం సమస్యగా మారింది’’అని ఎస్పీపీఎల్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. తయారీ వ్యయాలు 20 శాతం పెరిగాయని, జూన్, జూలై నెలల్లో తమ ఉత్పత్తులపై 3–5 శాతం స్థాయిలో ధరలను పెంచనున్నట్టు చెప్పారు. హయ్యర్ అప్లయనెన్స్ ఇండియా (చైనా సంస్థ) ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ సైతం.. షాంఘై లాక్డౌన్ వల్ల విడిభాగాలకు సమస్య ఏర్పడినట్టు చెప్పారు. ఏసీలు, ఫ్లాట్ ప్యానెల్ టీవీపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, రిఫ్రిజిరేటర్లపై ఈ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. చదవండి: దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ.. -
ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. ఇక వాటి ధరలు కూడా పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ - రష్యా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో వివిధ దేశాల ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ దాడులతో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి సరుకు ధర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యాన్స్, వాటర్ హీటర్లు, పంపులు, కుట్టు యంత్రాలు వంటగది ఉపకరణాలను తయారు చేసే ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల గత 15 నెలల్లో వివిధ ఉత్పత్తుల ధరలు 15% నుంచి 20% పెరిగినట్లు తెలిపింది. "ప్రస్తుతం, ఐరోపాలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది కాబట్టి, ఖర్చు పెరుగుదల మళ్ళీ పెద్ద సవాలు ఉంది" అని ఉషా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రోహిత్ మాథుర్ అన్నారు. ప్రత్యక్ష కమోడిటీ ధరల ద్రవ్యోల్బణం & ఇంధన ఖర్చుల పరోక్ష ప్రభావం కారణంగా ఉషా ఇంటర్నేషనల్ ఉత్పత్తుల ధరలు మరోసారి 10-12 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది అని ఆయన అన్నారు. "ఈ సమస్య ముడి చమురు ధరల కారణంగా వస్తుంది. ఇప్పుడు బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర 130 డాలర్లు దాటింది. దేశంలో ఇంధన ధరలు పెరిగితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇది రవాణా రంగా ఖర్చులను పెంచుతుంది" అని ఆయన అన్నారు. అల్యూమినియం, స్టీల్, రాగి & అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు 44.2%, 25.4%, 14.6% & 8.3% 2022 నాల్గవ త్రైమాసికంలో పెరిగాయి అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు తెలిపారు. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదల, ఇతర సరుకుల ద్రవ్యోల్బణానికి దారితీసాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!) -
వినియోగదారులకు భారీ షాక్, వీటి ధరలు పెరగనున్నాయ్
వినియోగదారులకు గృహోపకరణ సంస్థలు భారీ షాకివవ్వనున్నాయి. జనవరి ఫెస్టివల్ సీజన్ నుంచి మార్చి ఈ మూడు నెలల మధ్య కాలంలో ఫ్రిజ్, ఏసీల ధరలు భారీగా పెంచనున్నాయి. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్ సెస్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) ప్రకారం..ముడి సరకుతో పాటు సరుకు రవాణా పెరగడంతో కన్జ్యూమర్ డ్యూరబుల్ ఐటమ్స్‌ను 5 నుంచి 10 శాతం వరకు పెంచేందుకు ఆయా కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. కమోడిటీస్, గ్లోబల్ ఫ్రైట్, ముడి సరుకు పెరుగుదలతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ కేటగిరీలలో ఉత్పత్తుల ధరలను 3 నుండి 5 శాతం వరకు పెంచడానికి చర్యలు తీసుకున్నామని హైయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ తెలిపారు. ఇప్పటికే ఏసీల ధరలను 8శాతం వరకు పెంచిన పానాసోనిక్, మరింత పెంచే ఆలోచనలో ఉందని, అందుకే గృహోపకరణాల ధరల పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ కండీషనర్లు ఇప్పటికే దాదాపు 8 శాతం పెరిగాయి.పెరుగుతున్న వస్తువులు, సప్లయ్ చైన్ ధరల్ని బట్టి వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, గృహోపకరణాల ధరల పెరగొచ్చని పానాసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. కాగా, భారత్‌లో రూ.75 వేల కోట్లున్న ఇండియన్ అప్లయన్స్ మార్కెట్ కోవిడ్ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. లాక్డౌన్, చిప్ కొరతతో పాటు ఉత్పత్తులు తగ్గి పోవడం,అదే సమయంలో డిమాండ్లు పెరగడంతో పలు కంపెనీలు వస్తువుల ధరల్ని పెంచేందుకు సిద్ధమయ్యాయి. చదవండి: 2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..! -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
యాడ్వెంట్ చేతికి యురేకా ఫోర్బ్స్!
ముంబై: కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందు నిలవనున్నట్లు తెలుస్తోంది. వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్స్ దిగ్గజం యురేకా ఫోర్బ్స్ విక్రయానికి వీలుగా ప్రమోటర్ గ్రూప్ షాపూర్జీ పల్లోంజీ ఇప్పటిఏ బిడ్స్‌ను ఆహ్వానించిన విషయం విదితమే. కంపెనీ కొనుగోలు రేసులో పీఈ దిగ్గజాలు యాడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్బర్గ్ పింకస్తోపాటు.. స్వీడిష్ హోమ్ అప్లయెన్సెస్ కంపెనీ ఎలక్ట్రోలక్స్ బిడ్స్ పోటీపడుతున్నట్లు సంబంధిత వర్గాలు జూన్‌లో పేర్కొన్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన ఫోర్బ్స్ అండ్ కంపెనీకి అనుబంధ సంస్థే యురేకా ఫోర్బ్స్. కోవిడ్–19 పరిస్థితుల తదుపరి ఆరోగ్యం, పరిశుభ్రత, గృహ సౌకర్యాలు(హోమ్ ఇంప్రూవ్మెంట్) విభాగంపై అధిక దృష్టిపెట్టిన గ్రూప్ యురేకా ఫోర్బ్స్‌ను విక్రయించేందుకు నిర్ణయించింది. తద్వారా రుణ భారాన్ని సైతం తగ్గించుకునే యోచనలో ఉన్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. డీల్‌కు వీలుగా..: యురేకా ఫోర్బ్స్ విక్రయానికి అనువుగా డీల్‌ను కుదుర్చుకునేందుకు షాపూర్జీ గ్రూప్ అంతర్గత పునర్వ్యవస్థీకరణను చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోర్బ్స్ అండ్ కంపెనీ నుంచి యురేకా ఫోర్బ్స్‌ను విడదీయనున్నట్లు తెలియజేశాయి. యురేకాను కొనుగోలు చేయడంలో యాడ్వెంట్ ఇంటర్నేషనల్‌కు అవకాశాలు అధికంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డాయి. క్రాంప్టన్ గ్రీవ్స్ డీల్ ద్వారా లాభపడిన యాడ్వెంట్కు కన్జూమర్ విభాగంలో పట్టుండటం మద్దతుగా నిలవనున్నట్లు తెలియజేశాయి. రూ. 4,500–5,000 కోట్ల మధ్య విక్రయ ఒప్పందం కుదిరే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. -
ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్రయ్!
న్యూఢిల్లీ: వినియోగ ఉత్పత్తుల విక్రయాలపై మందగమన ప్రభావాలు గణనీయంగా కనిపిస్తున్నప్పటికీ .. ఎలక్ట్రికల్ ఉపకరణాల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదుకావడంతో ఏసీలు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు వంటి పలు రకాల కూలింగ్ ఉత్పత్తుల విక్రయాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలోని మిగతా విభాగాలతో పోలిస్తే ఎలక్ట్రికల్ ఉపకరణాల విభాగం మెరుగైన పనితీరు కనపర్చినట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈడీ అనుజ్ పొద్దార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిశ్రమపరంగా ఏసీల అమ్మకాలు 20 శాతం, ఫ్రిజ్‌ల విక్రయాలు 12 శాతం మేర వృద్ధి సాధించినట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. టీవీల కన్నా .. ఏసీలకే ఓటు.. వేసవి ఉష్ణోగ్రతలు ఈసారి ఎగబాకడంతో కొనుగోలుదారులు టీవీల కన్నా ఏసీల వైపే ఎక్కువగా మొగ్గు చూపినట్లు నంది పేర్కొన్నారు. అంతే కాకుండా వీడియో కంటెంట్ చూసే విషయానికొస్తే.. టీవీల్లో కన్నా మొబైల్ ఫోన్స్‌కి ప్రాధాన్యం పెరుగుతుండటం కూడా టీవీల అమ్మకాలపై ప్రభావం చూపిందన్నారు. దీంతో టీవీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయని వివరించారు. ఆఖరికి క్రికెట్ వరల్డ్ కప్ కూడా టెలివిజన్ల అమ్మకాల వృద్ధికి ఉపయోగపడలేదు. మరోవైపు లో–బేస్ ఎఫెక్ట్ సైతం ఏసీల విక్రయాల్లో వృద్ధికి కొంత కారణమై ఉండొచ్చని బ్లూస్టార్ జాయింట్ ఎండీ బి. త్యాగరాజన్ తెలిపారు. గతేడాది అధిక కమోడిటీల ధరలు, కరెన్సీ మారకం రేటులో హెచ్చుతగ్గులు, కొంత సాధారణ ఉష్ణోగ్రతలు తదితర అంశాల కారణంగా ఏసీల విక్రయాల వృద్ధి పెద్దగా నమోదు కాలేదని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, వరదల మూలంగా ఆగస్టులో ఏసీల విక్రయాలు ఒక మోస్తరు స్థాయిలో ఉన్నా పండుగల సీజన్ మొదలవుతుండటంతో సెప్టెంబర్‌లో మళ్లీ వృద్ధి కనిపించవచ్చని పేర్కొన్నారు. మందగమన ప్రభావాలూ ఉన్నాయి.. జూలై, ఆగస్టుల్లో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం అమ్మకాలు అంత ఆశావహంగా ఏమీ లేవని నంది పేర్కొన్నారు. కొన్ని విభాగాల్లో క్షీణత కూడా నమోదైందని వివరించారు. చాలా రంగాల్లో ఆర్థిక మందగమనం మూలంగా.. వినియోగదారుల కొనుగోలు ధోరణులపై కూడా ప్రభావం పడిందని తెలిపారు. కొనుగోలు నిర్ణయాలను కస్టమర్లు వాయిదా వేసుకోవడం కూడా జరిగిందని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వర్షపాతం సరైన రీతిలో లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో పంటలు వేయడంలో జాప్యాలు జరగ్గా.. ఇంకొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతంతో పంటలు కొట్టుకుపోవడం జరిగిందని నంది చెప్పారు. ఇలా వ్యవసాయోత్పత్తి మందగించి, ఆదాయాలు తగ్గడం వల్ల కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ కూడా మిగతా రంగాల్లాగానే క్షీణత నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. రేట్ల కోత ఊతం.. వినియోగదారులు, పరిశ్రమ సెంటిమెంటును మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొన్ని చర్యలు పరిస్థితి మెరుగుపడటానికి ఊతమివ్వగలవని భావిస్తున్నట్లు నంది చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70,000 కోట్ల మేర కేంద్రం నిధులు ప్రకటించడం, ఆర్బీఐ పాలసీపరంగా కీలకవడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలతో మార్కెట్లో నిధుల లభ్యత మెరుగుపడుతుందని, రుణ వితరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. వినియోగదారుల సానుకూల సెంటిమెంటు, వర్షపాతం, ఉపాధి కల్పన.. ఈ మూడు అంశాలు పరిశ్రమకు కీలకంగా ఉంటాయని చెప్పారు. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఉదార విధానాలు, వ్యవస్థలో నిధుల లభ్యత మెరుగుపడటం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వినియోగ వృద్ధికి ఊతమివ్వగలవని వివరించారు. ప్రథమార్ధం మందగించడంతో.. వినియోగ వస్తువుల తయారీ సంస్థలు.. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రమోషనల్ ఆఫర్లను మరింతగా పెంచవచ్చని, పలు ఆకర్షణీయ ఫైనాన్సింగ్ స్కీములు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని హేతల్ గాంధీ చెప్పారు. కన్జూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో ఏకంగా 21 శాతం వాటా పండుగ సీజన్‌దే ఉంటోంది. అయినప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం గతంలో అంచనా వేసిన 6–7 శాతం కన్నా 200–300 బేసిస్ పాయింట్ల మేర తగ్గవచ్చని పేర్కొన్నారు. -
టీవీలు, ఏసీలు ఆన్‘లైనే’...
న్యూఢిల్లీ: టీవీలు, ఏసీలు వంటి వినియోగ ఉత్పత్తుల గురించి ఆన్లైన్లో అధ్యయనం చేసి, వీడియోలు చూసిన తర్వాతే కొనుక్కునే ధోరణి పెరుగుతోంది. ఇలా డిజిటల్ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కొనుగోలు ప్రక్రియలో ఏ దశలోనైనా కొనుగోలుదారు ఇంటర్నెట్‌ని వినియోగించిన పక్షంలో సదరు లావాదేవీని డిజిటల్ మాధ్యమం ప్రభావిత లావాదేవీగా పరిగణించి ఈ నివేదికను రూపొందించారు. ‘ప్రస్తుతం కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాల్లో దాదాపు 28% విక్రయాలు డిజిటల్ మాధ్యమంతో ప్రభావితమైనవే ఉంటున్నాయి. 2023 నాటికి ఇది 63%కి పెరగవచ్చు. విలువపరంగా చూస్తే 23 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చు. ఇందులో సుమారు 10 బిలియన్ డాలర్ల మేర అమ్మకాలు ఆన్లైన్ విక్రయాలే ఉంటాయని అంచనా‘ అని నివేదిక వివరించింది. టీవీలు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, చిన్న గృహోపకరణాలు, వాటర్ ప్యూరిఫయర్లు, మైక్రోవేవ్ ఒవెన్లు మొదలైన ఉత్పత్తుల ధరలపై 33% డిజిటల్ ప్రభావం ఉంటోంది. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ ప్రభావం.. నివేదిక ప్రకారం.. కొనుగోలు నిర్ణయాలపై డిజిటల్ మాధ్యమం ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇలా ప్రభావితమైన వారి సంఖ్య గడిచిన నాలుగేళ్లలో రెట్టింపయ్యింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వీరి సంఖ్య 5 రెట్లు పెరగ్గా, మహిళా కొనుగోలుదారుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. కొనుగోలుకు ముందు దాదాపు 80% మంది డిజిటల్ ప్రభావిత కొనుగోలుదారుల్లో ఏ బ్రాండు కొనాలి వంటి అంశాలపై సందిగ్ధత ఉంటోంది. దీంతో వారు సగటున దాదాపు 2–3 వారాలు ఆన్లైన్లో అధ్యయనం చేశాకే కొంటున్నారు. సెర్చి, సోషల్ మీడియా, బ్లాగ్లు, ఆన్లైన్ వీడియోలు మొదలైనవి ఆన్లైన్ రీసెర్చ్‌లో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు కూడా కొనుగోలుదారులకు చేరువయ్యేలా డిజిటల్ వ్యూహాలు అమలు చేస్తున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ డైరెక్టర్ (సేల్స్) వికాస్ అగ్నిహోత్రి చెప్పారు. -
మార్కెట్లోకి బజాజ్ మిక్సర్లు
హైదరాబాద్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తయారీ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కొత్తశ్రేణి మిక్సర్ గ్రైండర్లను విపణిలోకి విడుదల చేసింది. బజాజ్ స్ట్రోమిక్స్ ఎంజీ, ట్విస్టర్ డీఐఎక్స్ ఎంజీ, మేవ్రిక్ ఎంజీ, ట్విస్టర్ ఫ్రూటీ ఎంజీ, హెక్సాగ్రిడ్ ఎంజీ, డబ్ల్యూఎక్స్1 వెట్ గ్రైండర్లను ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి 6 ఉత్పత్తులను విడుదల చేయడం తొలిసారని.. మిక్సర్ గ్రైండర్ల మార్కెట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం వరకుంటుందని కంట్రీ హెడ్ అతుల్ శర్మ తెలిపారు. అనవసర పాలసీలు అమ్మితే కఠిన చర్యలు: భారతీ ఆక్సా హైదరాబాద్: తప్పుడు కాల్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టించి అనవసర ఉత్పత్తులు అంటగట్టే చర్యలకు వ్యతిరేకంగా జీవిత బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్ పలు చర్యలు తీసుకుంటోంది. దేశీయ బీమా రంగానికి ఈ తరహా కాల్స్ పెద్ద సమస్యగా మారాయని భారతీ ఆక్సాలైఫ్ ఎండీ, సీఈవో వికాస్‌సేత్ తెలిపారు. బాధ్యతగల బీమా కంపెనీగా ఈ తరహా అనైతిక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తమ విక్రయ బృందాలు కస్టమర్లకు అన్ని వివరాలు తెలియజేసి సరైన పాలసీ తీసుకునే విషయంలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. 6జీబీ, 128 జీబీల్లో నోకియా 8.1 హైదరాబాద్: ఇప్పుడు నోకియా 8.1 స్మార్ట్ ఫోన్లు 6 బీజీ, 128 జీబీ ర్యామ్లల్లో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని అన్ని ప్రముఖ మొబైల్ రిటైల్ స్టోర్లతో పాటూ అమెజాన్‌లో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ధర రూ.29,999 -
నోట్ల రద్దుతోరుణ డిమాండ్ డౌన్
ద్విచక్ర, కన్సూమర్ రుణాలపై ప్రభావం: సిబిల్ ముంబై: ద్విచక్ర, వినియోగ వస్తు(టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్) రుణాలపై డీమోనిటైజేషన్(నోట్ల రద్దు) ప్రభావం తీవ్రంగా పడిందని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ సిబిల్ పేర్కొంది. ‘టూవీలర్, కన్సూమర్ డ్యూరబుల్స్ రుణాల్లో సాధ్యమైనంత వరకు ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వాటానే ఎక్కువ. వీటిపై నోట్ల రద్దు చాలా ప్రతికూల ప్రభావం చూపింది’ అని సిబిల్ వైస్ ప్రెసిడెంట్ అమృత మిత్ర తెలిపారు. ప్రాంతాలల్లో వారీగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభావం అధికంగా ఉందని పేర్కొన్నారు. క్రెడిట్ కార్డులు, ఇతర వాహన రుణాలు సహా పలు కన్సూమర్ డ్యూరబుల్ ప్రొడక్టుల డిమాండ్ కూడా నవంబర్ 8 తర్వాత పడిపోయిందని చెప్పారు. 2015 జనవరి–సెప్టెంబర్ మధ్యకాలంతో పోలిస్తే 2016 ఇదే సమయంలో వినియోగ వస్తు రుణాల డిమాండ్ 35 శాతంమేర ఎగసిందని అమృత మిత్ర తెలిపారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో మాత్రం పలు విభాగాల్లోని పరిస్థితులు తారుమారు అయ్యాయని, డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన రుణ దరఖాస్తులు ఆశించిన (14 లక్షలు) స్థాయి కన్నా 43 శాతంమేర తక్కువగా వచ్చాయని తెలిపారు. వినియోగ వస్తు విభాగపు రుణ దరఖాస్తుల్లో 60 శాతం క్షీణత నమోదయ్యిందని పేర్కొన్నారు. -
ఆఫర్ల పండుగ!
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌ని పురస్కరించుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు భారీగా ఆఫర్లతో ఊదరగొడుతున్నాయి. డిస్కౌంట్లని, ఉచిత బహుమతులనీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కన్సూమర్ డ్యూరబుల్స్ తయారీ సంస్థలైతే కచ్చితమైన గిఫ్టులు, క్యాష్ బ్యాక్‌తో పాటు ఉచిత ఇన్స్టలేషన్, వార్షిక మెయింటెనెన్స్ వ్యయాల్లో డిస్కౌంట్లు, ఉచిత బీమా వంటి నోరూరించే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియన్ సంస్థ ఎల్జీ.. ఖరీదైన టీవీలపై ఉచితంగా 3డీ బ్లూ రే హోమ్ థియేటర్ని అందిస్తామంటోంది. అలాగే కొన్ని నిర్దేశిత హై-ఎండ్ టీవీ మోడల్స్‌ని కొంటే 22, 24 అంగుళాల ఎల్ఈడీ టీవీలను ఉచితంగా ఇస్తామని చెబుతోంది. కొన్ని స్మార్ట్ టీవీ మోడల్స్పైనైతే మ్యాజిక్ మోషన్ రిమోట్‌ని కచ్చితమైన బహుమతిగా ఎల్జీ అందిస్తోంది. ఇక ఎస్బీఐ కార్డుతో కనుక డబ్బు చెల్లిస్తే కొనుగోలుదారుకు అయిదు శాతం దాకా క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఏడు గంటల్లోగా ఎల్ఈడీ ఇన్స్టాలేషన్, వార్షిక మెయింటెనెన్స్ వ్యయాల్లో 30 శాతం డిస్కౌంట్లు, ఆరు నెలల పాటు ఉచిత బీమా వంటి స్పెషల్ ఆఫర్స్‌ని కూడా ఎల్జీ ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో మొదలైన ఈ పండుగ ఆఫర్లు నవంబర్ 30 దాకా కొనసాగనున్నాయి. వీటి ద్వారా ఈ పండుగ సీజన్లో అమ్మకాలు 20 శాతం దాకా పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది. శాంసంగ్ దూకుడు.. కొరియాకి చెందిన మరో దిగ్గజం శాంసంగ్ సైతం దూసుకెడుతోంది. తమ అల్ట్రా హెచ్డీ టీవీలు, 65..75 అంగుళాల ఎల్ఈడీ టీవీలు, నిర్దిష్ట ఎయిర్‌కండీషనర్స్, రిఫ్రిజిరేటర్స్ కొనుగోళ్లపై గెలాక్సీ ట్యాబ్లెట్ పీసీలను శాంసంగ్ అందిస్తోంది. 28-40 అంగుళాల మధ్య ఉన్న ఎల్ఈడీల కొనుగోళ్లపై బ్లూ-రే డిస్క్ ప్లేయర్‌ని ఉచితంగా ఇస్తోంది. ఫ్రంట్‌లోడ్ వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్లతో స్టీమ్ ఐరన్ బాక్స్‌ని ఫ్రీగా అందిస్తోంది. అంతేకాదు.. ప్లాస్మా టీవీలు, ఎంపిక చేసిన కొన్ని ఎల్ఈడీ టీవీ మోడల్స్‌పైనా రూ. 1,000 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తోంది. ఎయిర్ కండీషనర్‌ని గెలుపొందే అవకాశం కల్పించేలా స్క్రాచ్ కార్డునూ ఇస్తోంది. ఈ సీజన్లో సుమారు రూ. 3,500 కోట్ల వ్యాపారంపై శాంసంగ్ దృష్టి పెట్టింది. సోనీ లక్ష్యం రూ. 4,700 కోట్లు..: జపాన్ దిగ్గజం సోనీ.. పండుగ సీజన్లో రూ. 4,700 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తమ ఎక్స్‌పీరియా ఫోన్లు, ట్యాబ్లెట్ల కొనుగోళ్లపై ఉచిత బ్లూ రే ప్లేయర్, అదనంగా బేస్ హెడ్‌ఫోన్, మెమరీ కార్డు వంటి ఆఫర్లు ఇస్తోంది. అల్ట్రా హెచ్డీ టీవీలతో పాటు బ్లూ-రే ప్లేయర్‌ని, 5 సినిమాల డిస్క్‌లను ఉచితంగా అందిస్తోంది. ఎల్ఈడీ టీవీ కొంటే కార్డ్‌లెస్ హెడ్‌ఫోన్‌ని సోనీ ఇస్తోంది. పానసోనిక్ ఇండియా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు.. పానసోనిక్ ఇండియా సంస్థ తమ ఉత్పత్తులపై అదనపు వారంటీ, ఈఎంఐ అవకాశాలు, ఎక్స్ఛేంజ్..కాంబో ఆఫర్లు, కచ్చితమైన గిఫ్టులు ఇస్తామంటూ ఊదరగొడుతోంది. లూమిక్స్ సిరీస్ కెమెరాలపై 4జీబీ ఎస్డీ కార్డు, క్యారీ కేస్, మూడేళ్ల అదనపు వారంటీ వంటివి ఉచితంగా ఇస్తోంది. పానసోనిక్ ఇండియా రూ. 1,200 కోట్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రో ఒవెన్లు వంటి గృహోపకరణాలపై స్టీమ్ ఐరన్ బాక్స్, డెసర్ట్ సెట్స్ వంటివి ఉచితంగా అందిస్తోంది. 29 అంగుళాల వియెరా ఎల్ఈడీ టీవీపై బెనెటన్ బ్యాగ్‌ని ఫ్రీగా ఇస్తోంది. మరోవైపు, కన్సూమర్ అప్లయన్సెస్ తయారీ సంస్థ గోద్రెజ్ సైతం కొన్ని ఎంపిక చేసిన వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, మైక్రో ఒవెన్లు, ఎయిర్ కండీషనర్ల వంటి వాటిపై స్టీమ్ ఐరన్లు, జ్యూసర్ మిక్సర్ గ్రైండర్లు మొదలైనవి ఉచితంగా అందిస్తోంది. డీటీహెచ్ ఆపరేటర్లు.. డీటీహెచ్ ఆపరేటర్లు కూడా పండుగ సీజన్ బరిలో ముం దుంటున్నాయి. డిష్ టీవీ సంస్థ తమ హై డెఫినిషన్.. స్టాండర్డ్ డెఫినిషన్ సెట్ టాప్ బాక్సుల కొనుగోలుపై రూ. 1,500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. దీంతో పాటు హై డెఫినిషన్ బాక్స్‌ని కొన్న వారు స్టాండర్డ్ డెఫినిషన్ బాక్స్‌ని ఉచితంగా దక్కించుకునేలా కాంబో ఆఫర్ కూడా ప్రకటించింది.