టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బంపరాఫర్ తగిలింది. ప్రపంచ దేశాల్లో భారీ ఎత్తున గిగా ఫ్యాక్టరీలను స్థాపించేలా ఆయన కలలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా..తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనే మస్క్‌కు జాక్ పాట్ తగిలింది. తమ దేశంలో గిగా ఫ్యాక్టరీలు నెలకొల్పాలని సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఆఫర్ ఇచ్చారు.
ఇండోనేషియా ప్రావిన్స్ బాలీలో నవంబర్ 13, 14 రెండు రోజుల పాటు బీ20 సమ్మిట్ ఇండోనేషియా 2022 పేరుతో వాణిజ్య సదస్సు జరిగింది. ఆ సదస్సులో యోల్‌తో ఎలాన్ మస్క్ భేటీ, ఆ భేటీలో గిగా ఫ్యాక్టరీ గురించి వివరించాల్సి ఉంది. కానీ ట్విటర్ కొనుగోలుతో తీరిక లేకుండా వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలారు.
అయితే బుధవారం సౌత్ కొరియా కాలమానం ప్రకారం..ఉదయం 10 గంటలకు యోల్‌తో మస్క్ వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘గ్లోబల్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్‌పై’ వారిరువురూ చర్చించుకున్నారు.
మస్క్‌కు ఆఫర్
అనంతరం..తాము వచ్చే ఏడాది తాము ఏషియన్ కంట్రీస్‌లో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయని మస్క్ వెల్లడించారు. ఇప్పటికే యూఎస్,జర్మనీ, అమెరికా దేశాల్లో మొత్తం ఐదు గిగా ఫ్యాకర్టీలు ఉండగా..2023 నాటికి మరో ఫ్యాక్టరీ నిర్మించేలా ప‍్రణాళికల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం స్థల అన్వేషణలో ఉన్నట్లు చెప్పారు.
మస్క్ గిగా ఫ్యాక్టరీ ప్రణాళికల్ని విన్న యోల్..తమ దేశంలో టెస్లా కార్ల విడిభాగాల తయారీ ప్లాంటును (గిగా ఫ్యాక్టరీ) ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ మాట్లాడుతూ..కొరియాను అగ్రశ్రేణి పెట్టుబడిదారులలో ఒక దేశంగా పరిగణిస్తున్నామని, వర్క్ ఫోర్స్, టెక్నాలజీ, ప్రొడక్షన్ చేసే అనుకులమైన వాతావరణం వంటి పెట్టుబడి పరిస్థితులను సమగ్రంగా సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మస్క్ వ్యాఖ్యలు..భారీ లాభాల్లో షేర్లు
అంతేకాదు కొరియన్ కంపెనీలతో సప్లయ్ చైన్ సహకారం గణనీయంగా విస్తరిస్తుందని, వచ్చే ఏడాది కొరియన్ కంపెనీల నుంచి విడిభాగాల కొనుగోళ్లు 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మస్క్ వ్యాఖ్యల తర్వాత, సౌత్ కొరియా ఆటోమొబైల్, ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీల షేర్లు లాభాల్లో పరుగులు తీశాయి.
తిరస్కరించిన దేశాలు
ఈ గిగా ఫ్యాక్టరీ ఏర్పాట్ల విషయంలో ఎలాన్ మస్క్ తీరును భారత్, రష్యా దేశాలు తప్పు బట్టాయి. ముఖ్యంగా రష్యాతో సంప‍్రదింపులు జరిపి నెలల గడుస్తున్నా.. తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాట దాటేశారు. భారత్ విషయంలోనూ అదే జరిగింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కాలుష్యాన్ని వెలువరించవు కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గించాలంటూ భారత్‌ని కోరారు.
దీనికి ప్రతిగా ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పితే సుంకాల తగ్గింపు అంశం పరిశీలిస్తామంటూ భారత అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఆ రెండు దేశాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మాణాల విషయంలో అడ్డంకులు ఏర్పాడ్డాయి. కానీ తాజాగా సౌత్ కొరియా మస్క్‌ను ఆహ్వానించడం టెస్లాకు శుభ పరిణామమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మస్క్ ఇక్కడ
కొద్ది రోజుల క్రితం ఎలాన్ మస్క్ ట్విటర్‌ని కొనుగులో చేశారు. అనంతరం ఆ సంస్థపై దృష్టిసారించారు. మస్క్ లైట్ తీసుకుంటే టెస్లాకు నష్టం వాటిల్లే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆ సంస్థ పెట్టుబడిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో టెస్లా షేర్లు రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. వెరసీ ఈ బిలియనీర్ ఏడాదిలో 100.5 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అమెరికావ్యాప్తంగా 3.21లక్షల కార్లను రీకాల్ చేసింది. కార్ల టెయిల్ లైట్ల సమస్యలపై వినియోగదారుల నుంచి నిత్యం కంపెనీకి ఫిర్యాదులు వస్తున్నాయి.
అక్టోబర్ చివరిలో విదేశీ మార్కెట్లలో విక్రయించిన అనేక కార్లలో టెయిల్ లైట్లు సరిగా పని చేయడం లేదని కంపెనీకి ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరుణంలో ఎలాన్ మస్క్‌కు తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడంతో టెస్లాకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఇన్వెస్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment