న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ హరియాణాలో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ కేంద్రం కోసం తొలి దశలో రూ.11,000 కోట్లకుపైగా పెట్టుబడి చేయనున్నట్టు వెల్లడించింది. హరియాణా స్టేట్ ఇండస్ట్రియల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సోనిపట్ జిల్లాలో ఐఎంటీ ఖర్ఖోడ వద్ద 800 ఎకరాలను మారుతీ సుజుకీ కోసం కేటాయించింది. సామర్థ్యం పెంపునకు మరిన్ని తయారీ యూనిట్లను ఇక్కడ నెలకొల్పేందుకు సరిపడ స్థలం ఉందని మారుతీ సుజుకీ పేర్కొంది. తొలి దశ 2025 నాటికి పూర్తి కానుంది. తొలుత ఏటా 2.5 లక్షల యూనిట్ల కార్లను తయారు చేయగల సామర్థ్యంతో ఇది రానుంది. హర్యానా, గుజరాత్‌లో ఉన్న ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22 లక్షల యూనిట్లు.
Comments
Please login to add a commentAdd a comment