వడోదరలోని గ్యాస్‌ కర్మాగారంలో పేలుడు | 8 Dead in Blast at Gas Manufacturing unit Near Vadodara | Sakshi
Sakshi News home page

వడోదరలోని గ్యాస్‌ కర్మాగారంలో పేలుడు

Published Sun, Jan 12 2020 5:19 AM | Last Updated on Sun, Jan 12 2020 5:19 AM

8 Dead in Blast at Gas Manufacturing unit Near Vadodara - Sakshi

వడోదర: గుజరాత్‌ వడోదర జిల్లాలోని ఓ మెడికల్‌ గ్యాస్‌ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్‌ గవాసద్‌ గ్రామంలోని ఎయిమ్స్‌ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్‌ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్‌ ఎస్పీ సుధీర్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement