Gas Company
-
భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి
న్యూఢిల్లీ: భారత్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ అవకాశాలను సొంతం చేసుకోవాలంటూ అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వనం పలికారు. చమురు, గ్యాస్ రంగంలో అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలకు భారత్‌తో చేతులు కలపాలని కోరారు. అంతర్జాతీయ చమురు కంపెనీల సీఈవోలు, ఈ రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. ఇంధన వనరుల పెంపు, అందుబాటు ధరలు, ఇంధన భద్రత దిశగా భారత్ చేపట్టిన చర్యలను పరిశ్రమకు చెందిన వారు మెచ్చుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి వారికి ప్రధాని వివరంగా తెలియజేసినట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలియజేసినట్టు.. ముడి చమురు నిల్వ సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రస్తావించినట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న గ్యాస్ అవసరాలను తీర్చేందుకు వీలుగా గ్యాస్ పైపులైన్ల నిర్మాణం, పట్టణ గ్యాస్ పంపిణీ, ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు చర్యలను వారికి తెలియజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. -
వడోదరలోని గ్యాస్ కర్మాగారంలో పేలుడు
వడోదర: గుజరాత్ వడోదర జిల్లాలోని ఓ మెడికల్ గ్యాస్ తయారీ కర్మాగారంలో శనివారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. సుమారు 11 గంటల సమయంలో పద్రా తహసీల్ గవాసద్ గ్రామంలోని ఎయిమ్స్ ఇండస్ట్రీస్‌లో ఈ పేలుడు చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని పోలీసులు చెప్పారు. సిలిండర్లలో గ్యాస్ నింపే సమయంలో ఈ పేలుడు సంభవించిందని వడోదర రూరల్ ఎస్పీ సుధీర్ చెప్పారు. -
సేవా మోహనుడు
మానవసేవే మాధవసేవ అని అందరూ సూక్తులు చెబుతుంటారు తప్ప ఆచరణలో ఎవరూ పాటించరు. కోట్లకు పడగలెత్తిన వారు సైతం గుళ్లో ఉన్న మాధవుడికి మొక్కుతారు తప్ప...గుడి బయట ఉన్న మానవుడిని పట్టించుకోరు. సేవ చేయాలనే మనసు ఉండాలే కానీ...లక్షలు, కోట్లు ఉండనవసరం లేదని, ఉన్నంతలోనే సేవ చేయవచ్చని గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ అనే యువకుడు నిరూపిస్తున్నాడు. లక్ష్మీపురం(గుంటూరు): ఆ యువకుడు వ్యాపార వేత్తో, ఉన్నతోద్యోగో కాదు... గ్యాస్ కంపెనీలో పని చేసే సాధారణ కూలీ. డబ్బుకు పేద అయినా...సేవలో రాజు..అతని పేరు జొన్నలగడ్డ రాజమోహన్. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏ పూటకు ఆ పూట పనిచేసి కుటుంబాన్ని పోషించే వారు. ఒక్కో సందర్భంలో కుటుంబమంతా పస్తులున్న పరిస్థితి. ఇలాంటి దుస్థితి మరెవ్వరికి రాకూడదన్న ఆలోచన అతని మదిలో మెదిలింది. అందుకే ఉన్నంతలో...తను చేయగలినంతలో అన్నార్తులకు, దాహార్తులకు సేవ చేస్తున్నాడు. నగరంలోని హనుమయ్య నగర్‌కు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ హెచ్.పి గ్యాస్ కంపెనీలో నెలకు కేవలం 7వేల రూపాయల వేతనంపై పనిచేసే కూలీ. నెల జీతం అంతా కుటుంబ పోషణకు వినియోగిస్తాడు. భార్య సుజాత టైలరింగ్ చేస్తూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది. రాజమోహన్ ఖాళీ సమయంలో గ్యాస్ స్టౌవ్ రిపేర్లు చేస్తుంటాడు. ఈ అదనపు పనితో వచ్చి డబ్బంతా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తాడు. సహృదయ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి వారానికి సుమారు 40 మందికి అన్నదానం చేస్తుంటాడు. తల్లి దండ్రులు లేని అనాథ విద్యార్థులను చదవించడం, వారికి పుస్తకాలు, బ్యాగ్‌లు, దుస్తులు ఇవ్వడంతో పాటు వారికి కావల్సిన అవసరాలు తీరుస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. తన ద్విచక్రవాహనానికి మినరల్ వాటర్ క్యాన్‌ను కట్టుకొని సంచార చలివేంద్రం నడుపుతూ ఉచితంగా మంచినీరు అందిస్తాడు. ప్రతి సోమవారం జిల్లా అర్బన్ ఎస్పీ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు అందిస్తాడు. రోజూ ఎవరికో ఒకరికి సేవ చేస్తేనే తనకు తృప్తిగా ఉంటుందంటాడు రాజమోహన్. -
75 గ్యాస్ సిలిండర్ల పట్టివేత
పోచమ్మమైదాన్ : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పౌరసరఫరాలశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నగరంలోని తుమ్మలకుంటలో గల రావాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర శ్రీకాంత్ ఇంట్లో రెండు షట్టర్లలో గ్యాస్ సిలిండర్లు దిగినట్లు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్‌ను గ్యాస్ సిలిండర్లపై ప్రశ్నించగా.. గ్యాస్ కంపెనీ ఆటోడ్రైవర్ ఆటో చెడిపోరుుందని షట్టర్లో సిలిండర్లు పెట్టి వెళ్లాడని తెలిపారు. వెంటనే అధికారులు రాత్రి ఆ రెండు షట్టర్లు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం అధికారులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆటో డ్రైవర్ వచ్చాడా అని అడిగారు. రాలేదని, అతడి పేరు రమేష్ అని చెప్పారు. తాళాలు తీసే వ్యక్తిని పిలిపించి షట్టర్‌ను తీసి అందులోని 75 గ్యాస్(ఫుల్) సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్, ఆటో డ్రైవర్ రమేష్‌పై 6(ఏ) కేసు నమోదు చేసి, సిలిండర్లను హన్మకొండ బాలాజీ గ్యాస్ ఏజెన్సీకి తరలించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లయ్ డీటీ రత్నా వీరాచారి మాట్లాడుతూ రేషన్ సరుకులు, గ్యాస్ సిలిండర్లు అక్రమంగా తరలిస్తే టోల్ ఫ్రీ నం.18004251304కు ఫోన్ చేయాలన్నారు. దాడుల్లో ఏఎస్ఓ అనిల్‌కుమార్, హసన్‌పర్తి, వర్ధన్నపేట డిప్యూటీ తహసీల్దార్లు శ్రీనివాసచారి, రాజ్‌కుమార్, వీఆర్ఓ విక్రమ్ పాల్గొన్నారు. కాగా, ఇంత భారీ మొత్తంలో గ్యాస్ సిలిండర్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. ఈ రాకెట్ వెనుక గ్యాస్ ఏజెన్సీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారి హస్తం లేనిది ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ సిలెండర్లు సరఫరా కావు. ఇప్పటికైన పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించి ఆక్రమ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వెలగని దీపం
- ఉన్నవారికే మళ్లీ మంజూరు - ఎన్నికల ముందు ప్రతిపాదనలు రద్దు ? - ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు నల్లగొండ : దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరై ఏడాది కావస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. మంజూరైన గ్యాస్కనెక్షన్లకు సరిపడా లబ్ధిదారులను సైతం అధికారులు ఎంపిక చేయలేదు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధుల వత్తిడిమేరకు హడావుడిగా కొన్ని గ్యాస్కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారికే తిరిగి మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా గత అధికార పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుత ప్రభుత్వం భావి స్తోంది. అందుకే లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్యాస్ కంపెనీలకు కలుపుకుని 4,46,547 కనెక్షన్లు ఉన్నాయి. అయితే జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను దీపం పథకం కింద 76, 064 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా 45,400 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎన్నికల ముందే ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు వీటిలో 18,547 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 26,853 కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంకా 30,664 గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే తిరిగి మంజూరైనట్లు సమాచారం. నాయకులకు, కార్యకర్తలకు కనెక్షన్లు ఇప్పించారని.. సార్వత్రిక ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉన్న పాలకులు రాజకీయావసరాలకు వినియోగించుకున్నట్లు సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు వారి పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో గతంలో దీపం గ్యాస్ కనెక్షన్లకుఎంపికైన లబ్ధిదారుల జాబితాలను మరో సారి పరిశీలించాలని అవసరమైతే రద్దు చేయాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక ఎన్నికలకు ముందే కొంతవరకు పూర్తయినా పంపిణీకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు - నాగేశ్వర్రావు, డీఎస్ఓ నల్లగొండ దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన కోటాలో కొంతమందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గత ంలో ఎన్నికలకు ముందు కొన్ని గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారు ల ఎంపిక, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయాలపై నూతన ప్రభుత్వం ఆదేశా లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.