పోచమ్మమైదాన్ : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పౌరసరఫరాలశాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నగరంలోని తుమ్మలకుంటలో గల రావాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర శ్రీకాంత్ ఇంట్లో రెండు షట్టర్లలో గ్యాస్ సిలిండర్లు దిగినట్లు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్‌ను గ్యాస్ సిలిండర్లపై ప్రశ్నించగా.. గ్యాస్ కంపెనీ ఆటోడ్రైవర్ ఆటో చెడిపోరుుందని షట్టర్‌లో సిలిండర్లు పెట్టి వెళ్లాడని తెలిపారు.
వెంటనే అధికారులు రాత్రి ఆ రెండు షట్టర్లు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం అధికారులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆటో డ్రైవర్ వచ్చాడా అని అడిగారు. రాలేదని, అతడి పేరు రమేష్ అని చెప్పారు. తాళాలు తీసే వ్యక్తిని పిలిపించి షట్టర్‌ను తీసి అందులోని 75 గ్యాస్(ఫుల్) సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీకాంత్, ఆటో డ్రైవర్ రమేష్‌పై 6(ఏ) కేసు నమోదు చేసి, సిలిండర్లను హన్మకొండ బాలాజీ గ్యాస్ ఏజెన్సీకి తరలించారు. ఈ సందర్బంగా సివిల్ సప్లయ్ డీటీ రత్నా వీరాచారి మాట్లాడుతూ రేషన్ సరుకులు, గ్యాస్ సిలిండర్లు అక్రమంగా తరలిస్తే టోల్ ఫ్రీ నం.18004251304కు ఫోన్ చేయాలన్నారు. దాడుల్లో ఏఎస్‌ఓ అనిల్‌కుమార్, హసన్‌పర్తి, వర్ధన్నపేట డిప్యూటీ తహసీల్దార్‌లు శ్రీనివాసచారి, రాజ్‌కుమార్, వీఆర్‌ఓ విక్రమ్ పాల్గొన్నారు.
కాగా, ఇంత భారీ మొత్తంలో గ్యాస్ సిలిండర్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. ఈ రాకెట్ వెనుక గ్యాస్ ఏజెన్సీల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వారి హస్తం లేనిది ఇంత పెద్ద మొత్తంలో గ్యాస్ సిలెండర్లు సరఫరా కావు. ఇప్పటికైన పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టి సారించి ఆక్రమ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.
75 గ్యాస్ సిలిండర్ల పట్టివేత
Published Wed, May 6 2015 5:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement