
వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.
ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.
ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment