Asian Games 2023: పతకాల వేట ఆరంభం.. తొలి రోజు భారత షెడ్యూల్‌ ఇదే | Asian Games 2023 Day 1 India Full Schedule | Sakshi
Sakshi News home page

Asian Games 2023 Day 1 India Schedule: పతకాల వేట ఆరంభం.. తొలి రోజు భారత షెడ్యూల్‌ ఇదే

Published Sun, Sep 24 2023 7:42 AM | Last Updated on Sun, Sep 24 2023 10:00 AM

Asian Games 2023 Day 1 India Full Schedule - Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆసియాక్రీడలు-2023కు తేరలేచింది. శనివారం జరిగిన వేడుకలతో ఈ ఆసియా క్రీడల పోటీలు అధికారికంగా పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే ఆదివారం నుంచి పతకాల వేట ప్రారంభం కానుంది. ఇ ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం.

మెడల్‌ ఈవెంట్స్‌ 
షూటింగ్‌: మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్, వ్యక్తిగత విభాగం: రమిత, మెహులీ, ఆశి చౌక్సీ (ఉదయం గం. 6 నుంచి 9:15 వరకు). 

రోయింగ్‌: పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ (అర్జున్‌ లాల్, అరవింద్‌ సింగ్‌; ఉదయం గం. 7:10కు); పురుషుల డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌ (సత్నామ్‌ సింగ్, పరి్మందర్‌ సింగ్‌; ఉదయం గం. 8 నుంచి). మహిళల ఫోర్‌ ఫైనల్‌ (అశ్వతి, మృణ్మయి, ప్రియా దేవి, రుక్మిణి; ఉదయం. గం. 8:20 నుంచి). పురుషుల పెయిర్‌ ఫైనల్‌: బాబూలాల్‌ యాదవ్, లేఖ్‌ రామ్‌ (ఉదయం గం. 8:40 నుంచి). పురుషుల ఎయిట్‌ ఫైనల్‌ (ఉదయం గం. 9:00కు).  
మహిళల బాక్సింగ్‌ (54 కేజీలు తొలి రౌండ్‌): ప్రీతి వర్సెస్‌ సిలీనా (జోర్డాన్‌; ఉదయం గం. 11:30 నుంచి). 51 కేజీలు: నిఖత్‌ వర్సెస్‌ ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం; సాయంత్రం గం. 4:30 నుంచి) 

మహిళల టి20 క్రికెట్‌ సెమీఫైనల్‌: 
భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ (ఉ. గం. 6:30 నుంచి). 
ఫుట్‌బాల్‌ (లీగ్‌ దశ): పురుషుల విభాగం: భారత్‌ వర్సెస్‌ మయన్మార్‌ (సాయంత్రం గం. 5 నుంచి); మహిళల విభాగం: భారత్‌ వర్సెస్‌ థాయ్‌లాండ్‌ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి). 

హాకీ (లీగ్‌ దశ): పురుషుల విభాగం: భారత్‌ గీ ఉజ్బెకిస్తాన్‌ (ఉదయం గం. 8:45 నుంచి).  
టేబుల్‌ టెన్నిస్‌ (ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌): మహిళల విభాగం: భారత్‌ గీ థాయ్‌లాండ్‌ (ఉదయం 
గం. 7:30 నుంచి). పురుషుల విభాగం: 
భారత్‌ వర్సెస్‌ కజకిస్తాన్‌ (ఉ.గం. 9:30 నుంచి). 
వాలీబాల్‌ (క్వార్టర్‌ ఫైనల్‌): భారత్‌ వర్సెస్‌ జపాన్‌ (మధ్యాహ్నం గం. 12 నుంచి).  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement