
సెర్బియాతో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయానికి గురైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈనెల 28న స్విట్జర్లాండ్‌తో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని జట్టు వైద్యులు ప్రకటించారు. బ్రెజిల్ తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన నెమార్ 75 గోల్స్ చేశాడు.
మరో రెండు గోల్స్ చేస్తే బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా దిగ్గజం పీలే (77 గోల్స్) పేరిట ఉన్న రికార్డును అతను సమం చేస్తాడు. కాగా సెర్బియాతో తమ తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. బ్రెజిల్ యువ ఆటగాడు రిచర్లిసన్ రెండు గోల్స్‌తో తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్ గ్రూప్-జి నుంచి అగ్ర స్థానంలో నిలిచింది.
చదవండి: FIFA WC 2022: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే
Comments
Please login to add a commentAdd a comment