భారతదేశం ఇతర దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ దిగుమతులను తగ్గించాలని.. ప్రత్యామ్నాయ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే మనదేశంలో ఇథనాల్ ఉత్పత్తి పెంచడానికి సరైన టెక్నాలజీని సిద్ధం చేస్తున్నారు. దీనికి బ్రెజిల్ కూడా సహకరించనుంది.
ఇటీవల బ్రెజిల్‌లోని కుయాబాలో జరిగిన జీ20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన సాంకేతికతను భారతదేశంలో పెంచడానికి బ్రెజిల్ కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్.. బ్రెజిల్ వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కార్లోస్ ఫవారో ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ సమావేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించిన విషయాల మీద చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన ఒప్పందం నవంబర్‌లో జరిగే జీ20 నాయకుల సమావేశానికి ముందే ఖరారు అవుతుందని పెకొన్నారు.
జూన్ 2024లో జరిగిన ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ (ISO) 63వ కౌన్సిల్ సమావేశంలో.. చెరకు సాగు, చక్కెర, ఇథనాల్ ఉత్పత్తుల మెరుగైన వినియోగంలో మరింత స్థిరమైన పద్ధతులను అవలంబించడానికి భారతదేశం సభ్య దేశాల నుంచి సహకారాన్ని కోరింది. ప్రస్తుతం ఇథనాల్ ఉత్పత్తిలో యూఎస్ఏ, బ్రెజిల్ మొదటి, రెండో స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది.
ఇదీ చదవండి: బిజినెస్ లోన్ కావాలా?.. ముందుగా ఇవి తెలుసుకోండి
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో ఇథనాల్ మిశ్రమం శాతం 2019-20లో 5 శాతం నుంచి 2022-23లో 12 శాతానికి పెరిగింది. ఈ సమయంలో ఇథనాల్ ఉత్పత్తి 173 కోట్ల లీటర్ల నుంచి 500 కోట్ల లీటర్ల పెరిగింది. కాగా ఇప్పుడు బ్రెజిల్ సహకారంతో ఇది మరింత ఎక్కువవుతుంది భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment