వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కట్డడికి ఎన్ని చర్యలు చేపట్టినా నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47.16 లక్షలు దాటింది. ఇక వైరస్ ఇప్పటితో వరకు 3.12 లక్షల మంది మృతి చెందారు. కరోనా బారినపడిన 18.10 లక్షల మంది కోలుకున్నారు. ఇంకా చాలా దేశాలు వైరస్‌పై పెద్ద యుద్ధమే చేస్తున్నాయి. ముఖ్యంగా బ్రెజిల్‌లో ఇటీవల వైరస్ వ్యాప్తి ఎక్కువగా పెరగడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఇక రష్యాలోనూ వైరస్ వ్యాప్తి వేగం పెరిగింది. (కోవిడ్ వ్యాక్సిన్ ధర తక్కువే)
- అమెరికాలో 15,07,864 పాజిటివ్ కేసులు, 89,596 మంది మృతి
- స్పెయిన్‌లో 2,76,505 పాజిటివ్ కేసులు, 27,563 మంది మృతి
- రష్యాలో 2,72,043 పాజిటివ్ కేసులు, 2,537 మంది మృతి
- ఇంగ్లండ్‌లో 2,40,161 పాజిటివ్ కేసులు, 34,466 మంది మృతి
- బ్రెజిల్‌లో 2,33,142 పాజిటివ్ కేసులు, 15,633 మంది మృతి
- ఇటలీలో 2,24,760 పాజిటివ్ కేసులు, 31,763 మంది మృతి
- ఫ్రాన్స్‌లో 1,79,365 పాజిటివ్ కేసులు, 27,625 మంది మృతి
- జర్మనీలో 1,79,247 పాజిటివ్ కేసులు, 8,027 మంది మృతి
- టర్కీలో 1,48,067 పాజిటివ్ కేసులు, 4,096 మంది మృతి
- ఇరాన్‌లో 1,18,392 పాజిటివ్ కేసులు, 6,937 మంది మృతి
- భారత్‌లో 90, 927 పాజిటివ్ కేసులు, 2872 మంది మృతి
- చైనాలో 82,941 పాజిటివ్ కేసులు, 4,633 మంది మృతి
- కెనడాలో 75,864 పాజిటివ్ కేసులు, 5,679 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment