Omicron Risk Very High WHO Warns Of Severe Consequences- Sakshi
Sakshi News home page

Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్‌ఓ కీలక సూచనలు

Published Mon, Nov 29 2021 5:51 PM | Last Updated on Mon, Nov 29 2021 6:08 PM

Omicron Risk Very High WHO Warns Of Severe Consequences - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జెనివా: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని.. దీని పరిణామలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్‌ ప్రభావం ఎంత తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమంది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ సోమవారం ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేసింది. అవేంటంటే..

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచం అంతా వ్యాపించగలదు. కనుక అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు.. అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. 

►ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పు పొంచి ఉంది. దీని గురించి అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు జరగడం అవసరం. ఒమిక్రాన్‌ అసాంఖ్యమైన స్పైక్‌ మ్యూటేషన్‌లు కలిగి ఉంది. 

►రానున్న రోజుల్లో ఒమిక్రాన్‌కు సంబంధించి ముఖ్యమైన సమాచారం రానుంది. దీన్ని పరిశోధించిన తర్వాత దీని గురించి మరింత సమాచారం అందుబాటులోకి వస్తుంది. 

►రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా కరోనా బారినపడుతున్నారు. కనుక ప్రపంచ దేశాలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. 

చదవండి: 
‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌ కథాకమామిషూ
హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌.. సందిగ్ధంలో ప్రయాణికులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement