బీజింగ్: అత్యంత అరుదైన H3N8 బర్డ్‌ఫ్లూ రకం వైరస్‌తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదైంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రానికి చెందిన 56 ఏళ్ల మహిళ ఈ బర్డ్‌ఫ్లూ కారణంగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఉపరకమైన హెచ్3ఎన్8 సోకిన మూడో వ్యక్తి ఈమే అని పేర్కొంది. ఈ మూడు కేసులు చైనాలో నమోదుకావడం గమనార్హం. గతేడాది ఇద్దరు ఈ వ్యాధి బారినపడగా.. ఇప్పుడు ఈ మహిళ దీని బారినపడి చనిపోయింది.
హెచ్3ఎన్8 పక్షుల్లో సాధారణంగానే కన్పిస్తుందని, కానీ మనుషులకు ఇది వ్యాపించడం అత్యంత అరుదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ బర్డ్‌ఫ్లూ రకం మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశమే లేదని చెప్పింది. అందుకే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
చదవండి: North Korea: మరింత ‘అణు’ దూకుడు
Comments
Please login to add a commentAdd a comment