వినబడట్లే! దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి లోపం | World Hearing Day 2022: WHO Releases Hearing Loss Data | Sakshi
Sakshi News home page

వినబడట్లే! దేశంలో 6.3 కోట్ల మందికి వినికిడి లోపం

Published Thu, Mar 3 2022 9:23 AM | Last Updated on Thu, Mar 3 2022 9:31 AM

World Hearing Day 2022: WHO Releases Hearing Loss Data - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో వినికిడి సమస్య నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 6.3 కోట్ల మందికి పైగా వినికిడి లోపంతో బాధపడుతున్నారు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ వెల్లడించిన ప్రకారం.. ప్రస్తుతం ప్రతి లక్ష జనాభాలో 291 మందికి తీవ్రమైన వినికిడి లోపం ఉంది. వీళ్లలో ఎక్కువ శాతం మంది 0–14 ఏళ్లలోపు వారే.

దేశంలో ఏటా 27 వేల మంది పిల్లలు చెవిటి వారిగా పుడుతున్నారు. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒకరు వినికిడి సమస్యతో బాధపడతారని అంచనా. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న డయాబెటిక్‌ బాధితుల్లో 70 శాతం మందికి గణనీయంగా వినికిడి లోపం ఉంది. శబ్ద కాలుష్యం, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల చెవుడు, వినికిడి లోపం బాధితులు పెరుగుతున్నారు. మార్చి 3న ‘వరల్డ్‌ హియరింగ్‌ డే’ సందర్భంగా వినికిడి లోపంపై కేంద్రం ఈ అంశాలను ప్రస్తావించింది.

ప్రపంచ జనాభాలో 5 శాతం (43 కోట్లు) మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ప్రతి వెయ్యి జననాల్లో ఒకరు నుంచి ముగ్గురు వినికిడి లోపంతో పుడుతున్నారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరిద్దరు బాల్యంలోనే శాశ్వత వినికిడి లోపంతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement