జెనీవా: మంకీపాక్స్ ముప్పుపై మరోసారి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉన్నా.. తక్కువ కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు మాత్రం పాటించాలని కోరింది. అదే టైంలో కరోనా తరహాలో మంకీపాక్స్ మహమ్మారిగా మారిపోయే అవకాశం తక్కువని స్పష్టత ఇచ్చింది.
ఈ క్రమంలో త్వరలో జరగాల్సిన ఎల్జీబీటీక్యూ పరేడ్‌లను అడ్డుకోవాలని కొందరు పిలుపు ఇస్తుండగా.. ఆ అవసరం లేదని డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన చేసింది. యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా మంకీపాక్స్ విజృంభణలో.. స్వలింగసంపర్కుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తించారు ఎక్కువగా. దీంతో అసహజ లైంగిక కార్యకలాపాతోనే వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే.. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోయే ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్‌లపై ఆంక్షలు విధించాలన్న డిమాండ్ ఊపందుకుంది.
అయితే కేవలం స్వలింపసంపర్కులతోనే మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదనను వైద్యనిపుణులు కొట్టిపారేస్తున్నారు. వైరస్ ఎవరికైనా సోకుతుందని మరోసారి స్పష్టం చేసింది డబ్ల్యూహెచ్‌వో. వైరస్ సోకిన ఎవరి నుంచైనా సరే.. ఇన్‌ఫెక్షన్ మరొకరికి సోకుతుంది. కాబట్టి, ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్‌లను నిరభ్యరంతంగా నిర్వహించుకోవచ్చు, అది వాళ్ల హక్కు కూడా అని డబ్ల్యూహెచ్‌వో విభాగం ప్రకటన చేసింది.
ఎల్జీబీటీక్యూ ప్రైడ్ పరేడ్‌లు.. జూన్ 26న న్యూయార్క్‌లో, జులై 23న బెర్లిన్‌తో పాటు చాలా చోట్ల నిర్వహించబోతున్నారు. మరోవైపు తాజాగా యూరప్‌లో మరో 70కిపైగా కొత్త కేసులు రావడంతో.. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసుల సంఖ్య 300కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment