కెవాడియా(గుజరాత్): కోవిడ్ మహమ్మారి వల్ల భారత్‌లో 40.7 లక్షల మంది మృతి చెందారని అంచనా వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన ప్రకటనపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన నిరాధారమని పేర్కొన్నారు. దేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించారు. గుజరాత్‌లోని కెవాడియాలో గురువారం ప్రారంభమైన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్(సీసీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) 14వ సదస్సు శనివారం ముగిసింది. సదస్సులో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు పాల్గొన్నారు.
దేశంలో కరోనా సంబంధిత మరణాల విషయంలో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. అన్ని మరణాలను సమగ్ర, సమర్థ వ్యవస్థ ద్వారా, పారదర్శకతతో నమోదు చేసినట్లు గుర్తుచేశారు. ఇండియాలో కరోనా సంబంధిత మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను ఖండిస్తూ సదస్సులో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాలను భారత్ ఎంతమాత్రం అంగీకరించడం లేదని మాండవీయ ఉద్ఘాటించారు. లేదన్నారు. భారత్ అసంతృప్తిని డబ్ల్యూహెచ్‌ఓ దృష్టికి తీసుకెళ్లాలని, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించాలని మాండవీయను కోరినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment