హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వ్యాక్సిన్ల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆన్ ఇమ్యూనైజేషన్ (సేజ్) అక్టోబర్ 6న సమావేశం కానుంది. ఈ సమావేశంలో భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సేజ్ ముసాయిదా ఎజెండాలో డబ్ల్యూహెచ్‌ఓ అధికారులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో భారత్ బయోటెక్ ప్రతినిధులు పాల్గొని కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థత, సురక్షితత్వం, క్లినికల్ ట్రయల్స్ (1–3) వంటి వివరాలపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని సేజ్ ముసాయిదాలో తెలిపారు. 1,2,3 ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలను బట్టి వ్యాక్సిన్ ఎంతమేరకు రోగ నిరోధకతను అందివ్వగలదో పరిశీలించనున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment