WHO: మంకీపాక్స్‌ సామాజిక వ్యాప్తి చెందొచ్చు | WHO Fears Possible Community Spread Of Monkeypox | Sakshi

మంకీపాక్స్‌: 20 దేశాల్లో 200 కేసులు.. కమ్యూనిటీ స్ప్రెడ్‌ చెందొచ్చు, కానీ..-డబ్ల్యూహెచ్‌వో

Published Sat, May 28 2022 8:20 AM | Last Updated on Sat, May 28 2022 8:20 AM

WHO Fears Possible Community Spread Of Monkeypox - Sakshi

కరోనా రేంజ్‌లో కాకపోయినా.. మంకీపాక్స్‌ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహోచ్‌వో.. 

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్‌ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. ఈ మేరకు సీనియర్ మహిళా ప్రతినిధి ఒకరు శుక్రవారం మంకీపాక్స్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం ఉన్న తరుణంలో మంకీపాక్స్‌ కట్టడికి అవసరమైన సాయం అందజేస్తామని ఆమె పలు దేశాలకు హామీ ఇచ్చారు. అయితే.. కరోనా వైరస్‌లా మంకీపాక్స్‌ ప్రభావం చూపించే అవకాశాలు ఏమాత్రం లేవని ఆమె అన్నారు. 

మంకీపాక్స్‌ అంటువ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచదేశాలు తమ వద్ద పరిమితంగా టీకాల, ఔషధాలను పంచుకునేందుకు ఒక నిల్వ కేంద్రాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement