సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రస్తుత కరోనా వైరస్‌కు ‘వితిన్ డేస్ (రోజుల్లోనే)’ అని పేరు పెట్టాలని వైరస్ వర్గీకరణకు సంబంధించిన శాస్త్రవేత్తల అంతర్జాతీయ కమిటీ సూచించింది. ప్రాంతాలు, లేదా జంతువుల పేర్లు వచ్చేలా ఈ వైరస్‌కు నామకరణం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తల కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుతం ఈ వైరస్‌కు తాత్కాలికంగా ‘2019–ఎన్‌సీవవీ’ అని పేరు పెట్టిన విషయం తెల్సిందే. (కరోనా వైరస్ మృతుల సంఖ్య వేలల్లోనా!)
గతంలో కరోనా వైరస్ రకాలకు ‘సార్స్, మెర్స్’ అని పేర్లు పెట్టారు. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం కనుక కిరీటి ఆకృతిలో ఉన్న వైరస్‌ను కరోనా వైరస్ అని పిలుస్తూ వస్తున్నారు. వాటిలో పలు రకాలు ఉండడం వల్ల వాటిని గుర్తించడం కోసం పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుత వైరస్‌కు చైనా కరోనా వైరస్ అని, వుహాన్ కరోనా వైరస్ అని, స్నేక్ ఫ్లూ’ అని రకరకాల పేర్లతో ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. పత్రికల్లో, మాగజైన్లలో, సోషల్ మీడియాలో వచ్చిన ఇలాంటి పేర్లన్నింటిని పరిశీలించిన అనంతరం ‘వితిన్ డేస్’ అని పేరు పెడితే బాగుంటుందని వైరస్‌ల వర్గీకరణల అంతర్జాతీయ కమిటీ (ఐసీటీవీ) అభిప్రాయపడింది. ఇంతకుముందు వైరస్‌లకు ‘సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ను క్లుప్తీకరించి సార్స్‌గా, ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ను క్లుప్తీకరించి మెర్స్‌గా పిలిచారు. (కరోనా విశ్వరూపం)
అయితే మెర్స్‌తోపాటు స్పానిష్ ఫ్లూ, లైమ్ డిసీస్, జపనీస్ ఎన్‌సిఫలటీస్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, మంకీ ఫాక్స్ లాంటి పేర్లు జంతువులను, ప్రాంతాలను సూచిస్తున్నాయని, అలాంటి పేర్లు పెట్టడం సముచితం కాదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ‘వితిన్ డేస్’ అని కొత్త రకమైన పేరు పెట్టారు. కొన్ని రోజుల్లోనే ఇది వేగంగా విస్తరించి ప్రాణాంతకం అవుతుంది కనుక ఈ పేరు పెట్టి ఉండవచ్చు. (కరోనా వైరస్: విస్కీతో విరుగుడు!)
అన్‌నోన్, డెత్, ఫాటల్, ఎపిడెమిక్ లాంటి భయాందోళనలు రేకెత్తించే పేర్లు కూడా పెట్టరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన మార్గదర్శకాల్లో సూచించింది. అన్య ప్రభావాలకు దారితీసే ఓ జాతి, సంస్కృతి, ఆహార పదార్థాల పేర్లు కూడా పెట్టరాదని పేర్కొంది. తప్పుడు పేరు వల్ల కలిగే అనర్థాల గురించి బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్రిస్టల్ వాట్సన్ వివరిస్తూ ‘స్వైన్(పంది) ఫ్లూ’ వాస్తవానికి మనుషులకు వచ్చిందని, పందులకు రాలేదని, అలా పేరు పెట్టడం వల్ల పందుల నుంచి వస్తుందని భ్రమ పడి ఈజిప్టు అధికారులు 80 వేల పందులను అన్యాయంగా చంపేశారని చెప్పారు. (కరోనా ఎఫెక్ట్ : రూ 8000 కోట్ల నష్టం)
సాధారణంగా వైరస్‌లకు పేరు పెడతారు తప్ప, వాటి ద్వారా వచ్చే జబ్బులకు పేరు పెట్టరు. చాలా రకాలైన వైరస్‌ల వల్ల ‘నిమోనియా’ను పోలిన లక్షణాలుగానీ, నిమోనియాగానీ వస్తుంది. ఇలా చాలా రకాల వైరస్ వల్ల మానవుల శరీరంలో ఒకేరకమైన మార్పులు సంభవిస్తాయి కనుక అలాంటి జబ్బులకు పేరు పెట్టడం కష్టం కావచ్చు. అయితే వైరస్‌లపేరుతోనే జబ్బులను కూడా పిలవడం సాధారణమైంది. (కరోనా కేసులు 20,522)
Comments
Please login to add a commentAdd a comment