న్యూఢిల్లీ: చాలా సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రముఖ బార్‌కోడ్ స్కానర్ యాప్ ను వెంటనే ఆన్ ఇన్‌స్టాల్ చేయండి లేకపోతే హ్యాకింగ్ భారీన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ యాప్ లో వైరస్ ప్రవేశించినట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఈ వైరస్ వేగంగా ఇతర మొబైల్స్ లోకి వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు. దాంతో వెంటనే గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను తొలిగించినట్లు పేర్కొంది. దీనిని ఇప్పటికే ఒక కోటికి మందికి పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకొని వాడుతున్నారు.
ఈ యాప్ ను ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడంతో పాటు చాలా రకాల ప్రకటనలు(యాడ్స్) వస్తున్నాయని కొందరు వినియోగదారులు గుర్తించారు. ఈ సమస్య గురుంచి తెలుసుకున్న వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న వారు వెంటనే దీనిని అన్‌ఇన్‌స్టాల్ కోరింది. ఈ యాప్ ను లావాబర్డ్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మీ ఫోన్‌లో దీనిని కనుగొనలేకపోతే AppCheckerని డౌన్‌లోడ్ చేసి 'బార్‌కోడ్ స్కానర్' ను చెక్ చేయండి. బార్‌కోడ్ స్కానర్ ఒక సాధారణ యాప్, గత సంవత్సరం డిసెంబర్ 4న తీసుకొచ్చిన అప్డేట్ తర్వాత ఫోన్‌లలోకి వైరస్ వచ్చినట్లు తెలుస్తుంది.
చదవండి: ఓటు వేసి రియల్‌మీ నార్జో30 గెలుచుకోండి
ఆ ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేయనున్న ఆపిల్
Comments
Please login to add a commentAdd a comment