సాక్షి,న్యూఢిల్లీ: హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనస్తున్నామని జేపీనడ్డా తెలిపారు. ఈ మేరకు సోమవారం(జనవరి6) ఆయన మీడియాతో మాట్లాడారు.
‘హెచ్ఎంపీవీ వైరస్ కొత్తదేమీ కాదు.2001 సంవత్సరంలోనే దీన్ని కనుగొన్నారు. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుంది. శీతాకాలం ప్రారంభంలో ఇది బాగా వ్యాపిస్తుంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయంపై పరిశోధన చేస్తోంది.
భారత్‌లో శ్వాసకోశ సంబంధ సమస్యల తీవ్రత లేదు. ఈ వైరస్‌పై డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జాయింట్ గ్రూప్ సమీక్ష నిర్వహించింది.సమస్య ఎదుర్కోవడానికి యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది.
ఇదీ చదవండి: హలో.. హెచ్‌ఎంపీవీ వైరస్‌తో జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment