Central Health Minister
-
Mansukh Mandaviya: కొత్త ఆరోగ్య మంత్రికి ట్రోల్స్ వెల్కమ్
ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. అలాంటిది.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్‌లో అడుగుపెట్టిన మన్షుక్ లక్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్‌లు దారుణంగా ఉన్నాయి. Tray and tray will be success . — Mansukh Mandaviya (@mansukhmandviya) January 9, 2014 Mr. Rahul Ji, great grand son of Mahatma Gandhi already wrote you that RSS was not at all responsible for death of Gandhiji — Mansukh Mandaviya (@mansukhmandviya) March 10, 2014 ఇక అందుకు సంబంధించి స్రీ్కన్ షాట్స్ కొన్ని నెట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్ అకౌంట్‌కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్ అయి ఉన్నాయి. ఇక గుజరాత్‌కు చెందిన మన్షుక్ మాండవీయ.. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్‌గా రీట్వీట్లు చేస్తున్నారు. He is our Health of Minister (#MansukhEnglish)🤦🙄#दर्जासमजूनघ्या #mansukhmandaviya @ShivsenaComms #CabinetReshuffle2021 #CabinetExpansion2021 pic.twitter.com/R8tpbEVd4I — 𝐏𝐫𝐚𝐭𝐢𝐤 𝐑𝐚𝐣𝐞𝐧𝐝𝐫𝐚 𝐊𝐚𝐥𝐚𝐬𝐤𝐚𝐫 (@PratiKkalaskar_) July 8, 2021 Several yers back i applied for a job They canceled me because of my Vary good ingles accent... Today me is halth Minister of the Entire duniya 😌#CabinetReshuffle#MansukhEnglish#MansukhMandviya#englishfans — Mansukh मंद | वाया Parody (@PranavThe2nd) July 7, 2021 Mansukh Mandaviya is our Health of Minister pic.twitter.com/mpYMEgI0DQ — Joy (@Joydas) July 7, 2021 -
వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
-
కరోనాతో జాగ్రత్త...
-
ఫార్మ్.డి గ్రాడ్యుయేట్స్ ఎంబీబీఎస్‌తో సమానమే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్ కోర్సుతో సమానంగా గుర్తించాలన్న ఏ డిమాండ్ ప్రభుత్వం దృష్టికి రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మంగళవారం రాజ్య సభకు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో ఎంబీబీఎస్‌తో సమానంగా తమ కోర్సును కూడా గుర్తించాలంటూ ఫార్మ్.డి గ్రాడ్యుయేట్ల నుంచి డిమాండ్ వస్తున్న విషయం వాస్తవమేనా అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఇంటర్మీడియెట్ అనంతరం ఫార్మ్.డి విద్యార్దులు ఆరేళ్ళపాటు ఈ కోర్సును అధ్యయనం చేస్తారని మంత్రి వివరించారు. కోర్సులో భాగంగా రెండు, మూడు, నాలుగో సంవత్సరంలో విద్యార్ధులకు ఏటా 50 గంటలపాటు ఆస్పత్రిలో అధ్యయనం ఉంటుందని పేర్కొన్నారు. అయిదో సంవత్సరంలో ప్రతి రోజు వార్డు రౌండ్ డ్యూటీ నిర్వహిస్తారని, ఆరవ సంవత్సరంలో 300 పడగకల ఆస్పత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తారని వెల్లడించారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అధ్యాపకుడి పర్యవేక్షణలో విద్యార్ధి ఫార్మసీ, హెల్త్ కేర్ ప్రాక్టీస్ చేస్తారని మంత్రి తెలిపారు. ఫార్మ్.డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలన్న డిమాండ్ ఏదీ ప్రభుత్వ దృష్టికి రానప్పటికీ ఈ కోర్సు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్‌ని క్లినికల్ ఫార్మసిస్ట్‌గా గుర్తించాలంటూ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి వినతులు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. పీసీఐ రూపొందించిన ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన, రిజిస్టర్ అయిన ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు తమ వృత్తిపరమైన ప్రాక్టీస్‌లో భాగంగా రోగులకు మందులు ఇవ్వవచ్చునని మంత్రి తెలిపారు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా క్లినికల్ ఫార్మసిస్టులు 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇతర హెల్త్ కేర్ నిపుణులతో కలిసే పని చేస్తారు. ఫార్మసీ ప్రాక్టీస్ నిబంధనల ప్రకారం ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలోని మెడికల్ సర్వీసెస్ విభాగాల్లో డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అర్హులని నడ్డా వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాలలో ఫార్మ్.డి గ్రాడ్యుయేట్లు క్లినికల్ ఫార్మసిస్ట్‌లుగా పని చేస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. -
ఆ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదు..
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళంలోని ఉద్దానం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో నిన్న (మంగళవారం) వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వక సమాధామిచ్చారు. ఆయా ప్రాంతాల్లో రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నవ్యాధులకు మూలకారణాలేమిటో విచారించడానికి కేంద్ర బృందం శ్రీకాళంలో పర్యటించిందనీ, కానీ దానికి గల కారణాలు వెల్లడి కాలేదన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందా? అన్న ప్రశ్నకు ఆరోగ్య మంత్రి జవాబిస్తూ... శ్రీకాళంలో ఇప్పటికే అయిదు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్), టెక్కలి, పాలకొండ, పలాసలోని ఏరియా ఆస్పత్రుల్లో, సోంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధి మరింతగా ముదరకుండా చూడడానికి 15 ప్రత్యేక మొబైల్ మెడికల్ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలోగల కింగ్ జార్జి హాస్పిటల్ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రిఫరెల్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సాంకేతక, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాల కింద దేశంలో 99 ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 8 ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించామన్నారు. అయితే అందులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెలిగోడు ప్రాజెక్టును ప్రతిపాదించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా అనుప్రియ వెల్లడించారు. -
వివాదాల వలలో హర్షవర్ధన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ ప్రచారంలో కండోమ్స్ వినియోగంపై కంటే భార్యాభర్తలు నిబద్ధతతో కూడిన లైంగిక సంబంధాలకు ప్రాధాన్యమివ్వాలంటూ ఆయన ఇటీవల అమెరికాలో చేసిన వ్యాఖ్యైలపె రేగిన వివాదం సద్దుమణగకముందే పాఠశాలలో లైంగిక విద్యను నిషేధించాలని ఆయన వెబ్సైట్ లోవెల్లడించిన అభిప్రాయం సరికొత్త వివాదాన్ని సృష్టించింది. ఢిల్లీ పాఠశాలలకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ విజ న్ డాక్యుమెంట్లో ఆయన తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరిస్తూ స్కూళ్లలో ప్రస్తుతం బోధిస్తున్న సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధిస్తామని, యోగాను తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే విద్యను పాఠ్యాంశాల్లో చేర్చాలని, భారతీయ సంస్కృతిని గురించి విద్యార్థులకు తెలియజెప్పాలని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మహిళా సంస్థ లు, సామాజిక కార్యకర్తలు దీనిని వ్యతిరేకించారు. అయితే హర్షవర్ధన్ తాను సెక్స్ ఎడ్యుకేషన్ నిషేధించాలని అనలేదంటూ వివరణ ఇచ్చారు. అంత కు ముందు ఆయన న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్ఐవి ఎయిడ్స్‌పై నియంత్రణ కోసం కండోమ్స్ వాడకాని కన్నా భార్యాభర్తల మధ్య నిబద్ధతతో కూడిన శారీరక సంబంధాలను ప్రోత్సహించాలనేది తన అభిప్రాయమని, ఇది భారతీయ సంస్కృతి మాత్రమే కాకుండా శాస్త్రీయమైన నివారణ మార్గమని పేర్కొన్నారు. కండోం లతో సురక్షితమైన సెక్స్ జరుపుతున్నామన్న నమ్మ కం కలిగిస్తాయని, అన్నిటికంటే సురక్షితమైన సెక్స్ భార్యాభర్తల మధ్య నిబద్ధదత తో కూడిన లైంగిక సంబంధం అవసరమని ఆయన పేర్కొన్నారు. హర్షవర్ధన్ వెలిబుచ్చిన అభిప్రాయంపై పలు ఎన్జీఓలు, ఆరోగ్య కారకర్తలు గగ్గోలు పెట్టారు. ‘హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ ప్రచార ఉద్యమం కండోమ్స్పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించకూడదు. కండోమ్ వాడుతున్నంతవరకు ఎటువంటి అక్రమ లైంగిక సంబంధం కలిగిఉన్నా ఫర్వాలేదనే తప్పుడు సందేశాన్ని ఇది అందిస్తుంది. లైంగిక సంబంధాలలో భార్యభర్తలు ఒకరికి కట్టుబడి ఉండాలి’ అనే తన వ్యాఖ్యైలపె హర్షవర్ధన్ వివరణ ఇస్తూ కండోమ్స్ పగిలిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల లైంగిక సంబంధాల్లో నిజాయితీ ముఖ్యమని పేర్కొన్నారు.