హైదరాబాద్: హ్యూమన్ మెటా న్యూమోవైరస్ (HMPV) వైరస్‌పై పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha). హెచ్‌ఎంపీవీ వైరస్ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని గుర్తించినట్లు ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్‌ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదుతువున్నట్లు తెలుస్తోందని, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దీని తీవ్రత ఎలా ఉందనే పరిస్థితిని సమీక్షిస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు రెగ్యులర్‌గా కో-ఆర్డినేట్ చేసుకుంటున్నారని, ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదర్కొనేందుకు ప్రభ/త్వం వైద్య పరంగా సంసిద్ధంగా ఉందన్నారు.
డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసేలా నిరాధార తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తోందని హెచ్చరించారు దామోదర.
కాగా, భారత్‌లో HMPV ఆందోళన సృష్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే నాలుగు కేసులు వెలుగు చూడటం జనాల్లో అలజడి మొదలైంది. భారత్‌లో ఒక్కరోజే హెచ్‌ఎమ్‌పీవీ కేసులు సంఖ్య నాలుగుకి చేరడంతో కలవరం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ వైరస్ కేసు ఒకటి వెలుగు చూసింది. కోల్‌కతాలో ఐదు నెలల శిశువుకు హెచ్‌ఎమ్‌పీవీ పాజిటివ్ వచ్చింది. కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.
ఇప్పటికే దీని ప్రభావం చైనా(China)లో అధికంగా ఉంది. అక్కడ వేలాది మంది జలుబు దగ్గ జ్వరం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇది మరో కోవిడ్ విపత్తు అవుతుందా అన్న భయం నెలకొంది. గతంలో కోవిడ్ సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. దాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే హెచ్‌ఎమ్‌పీవీ విస్తరించడంతో ఒకింత ఆందోళన ఎక్కువైంది. ముందస్తు జాగ్రత్తలపై పలు దేశాలు ఇప్పటికే కీలక సూచనలు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే దీని ప్రభావంపై ఒక అంచనాకు రాలేకపోతున్నా, జా గ్ర త్తలు అవసరమనే విషయం అర్థమవుతోంది. కోవిడ్ సమయంలో ఏవైతే జాగ్ర త్లలు పాటించారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తే వైరస్ బారి నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment